Mallojula Venugopal Rao: 44 ఏళ్ల తర్వాత సొంతూరికి మాజీ మావోయిస్టు నేత మల్లోజుల.. కుటుంబ సభ్యుల భావోద్వేగం
- అనారోగ్యంతో ఉన్న అన్నను చూసేందుకు పోలీసుల అనుమతితో రాక
- కుటుంబ సభ్యులను చూసి భావోద్వేగానికి లోనైన సోనూ దాదా
- పోలీసులు తొందరపెట్టడంతో భోజనం చేయకుండానే వెనుతిరిగిన వైనం
మావోయిస్టు కేంద్ర కమిటీ మాజీ సభ్యుడు మల్లోజుల వేణుగోపాల్ రావు అలియాస్ సోనూ దాదా 44 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత తన స్వస్థలమైన పెద్దపల్లిలో అడుగుపెట్టారు. ఆదివారం ఉదయం భార్యతో కలిసి ఇంటికి వచ్చిన ఆయన్ను చూసి కుటుంబ సభ్యులు భావోద్వేగానికి లోనయ్యారు. అన్న అనారోగ్యంతో బాధపడుతున్నారని తెలిసి పోలీసుల అనుమతితో తన భార్య సిడాం విమలచంద్ర (తారక)తో కలిసి ఆయన పెద్దపల్లికి చేరుకున్నారు.
ఇన్నేళ్ల తర్వాత ఇంటికి వచ్చిన సోదరుడు వేణుగోపాల్‌ను చూసి ఆయన అన్న ఆంజనేయులు కన్నీటిపర్యంతమయ్యారు. సోదరుడిని ఆలింగనం చేసుకుని భావోద్వేగానికి గురయ్యారు. అయితే, తన అన్న, వదినను తప్ప కుటుంబంలోని తన మేనల్లుళ్లు, మేనకోడళ్లు, ఇతర బంధువులను ఆయన గుర్తుపట్టలేకపోయారు. వారితో కాసేపు ముచ్చటించారు. అయితే, వెంట వచ్చిన మహారాష్ట్ర పోలీసులు తొందరపెట్టడంతో కుటుంబ సభ్యులతో భోజనం కూడా చేయకుండానే ఆయన మధ్యాహ్నం అక్కడి నుంచి వెనుదిరగాల్సి వచ్చింది.