భారత్‌కు రుణపడి ఉంటా... నా భార్యతో మొదటి డేటింగ్ ఇండియన్ రెస్టారెంట్ లోనే జరిగింది: నెతన్యాహు

Benjamin Netanyahu indebted to India his first date was at Indian restaurant
భారత్‌కు తాను వ్యక్తిగతంగా ఎంతో రుణపడి ఉన్నానని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీతో కలిసి జెరూసలంలో గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, తన జీవితంలోని ఒక మధుర జ్ఞాపకాన్ని పంచుకున్నారు. తన భార్య సారాతో మొదటి డేటింగ్ టెల్ అవీవ్‌లోని ఒక భారతీయ రెస్టారెంట్‌లో జరిగిందని ఆయన గుర్తుచేసుకున్నారు.

"ఈ విషయం నేను మీకు చెప్పానో లేదో నాకు తెలియదు నరేంద్ర... కానీ, నేను భారత్‌కు ఒక వ్యక్తిగత రుణం తీర్చుకోవాలి. నేను సారాను మొదటిసారి కలిసినప్పుడు, మా మొదటి లేదా రెండో డేటింగ్ ఒక ఇండియన్ రెస్టారెంట్‌లో జరిగింది. అక్కడి ఆహారం నమ్మశక్యం కాని రీతిలో అద్భుతంగా ఉంది. ఆ రోజే సారా మొదటిసారి భారతీయ వంటకాలను రుచి చూసింది. అది గొప్ప డేటింగ్. అందుకే నేను, నా పిల్లలు భారత్‌కు ఎప్పటికీ రుణపడి ఉంటాం" అని నెతన్యాహు ఉద్వేగంగా చెప్పారు. ఇరు దేశాల మధ్య స్నేహబంధం ఇలాగే కొనసాగాలని ఆకాంక్షించారు.

ప్రధాని నరేంద్ర మోదీ రెండు రోజుల ఇజ్రాయెల్ పర్యటనలో ఉన్నారు. బుధవారం టెల్ అవీవ్‌లో నెతన్యాహు, ఆయన భార్య సారా.. మోదీకి ఘనస్వాగతం పలికారు. అనంతరం జెరూసలంలోని నెసెట్‌లో మోదీ ప్రసంగించారు. ఇజ్రాయెల్ పార్లమెంటులో ప్రసంగించిన తొలి భారత ప్రధానిగా ఆయన చరిత్ర సృష్టించారు.
Go Back to Shorts
Benjamin Netanyahu
Narendra Modi
Israel
India
Indian restaurant
Sara Netanyahu
Jerusalem
Tel Aviv
India Israel relations
Netanyahu Modi meeting

More Telugu News