గాల్లోనే ఢీకొన్న రెండు విమానాలు.. నలుగురు పైలట్లు మృతి.. వీడియో ఇదిగో!
- ఫిలిప్పీన్స్‌లో రెండు సైనిక శిక్షణ విమానాలు గాల్లో ఢీ
- మనీలాకు దక్షిణంగా ఫెర్నాండో వైమానిక స్థావరం వద్ద ఘటన
- ఎస్ఎఫ్-260 రకం విమానాలు ప్రమాదానికి గురి
- ప్రమాద కారణాలపై దర్యాప్తు ప్రారంభం
- ఈ రకం విమానాల వినియోగం తాత్కాలికంగా నిలిపివేత
ఫిలిప్పీన్స్‌లో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. శిక్షణలో ఉన్న రెండు సైనిక విమానాలు గాల్లోనే ఢీకొని కూలిపోవడంతో నలుగురు పైలట్లు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన మనీలాకు దక్షిణంగా ఉన్న ఫెర్నాండో వైమానిక స్థావరం వద్ద చోటుచేసుకుంది. ఫిలిప్పీన్స్ వైమానిక దళం శనివారం ఈ విషయాన్ని ధ్రువీకరించింది.
ప్రమాదానికి గురైనవి ఎస్ఎఫ్-260 రకానికి చెందిన సింగిల్ ప్రొపెల్లర్ శిక్షణ విమానాలు. శిక్షణ విన్యాసాల్లో పాల్గొంటున్న సమయంలో రెండు విమానాలు గాల్లో ఢీకొన్నట్లు వీడియో దృశ్యాల్లో కనిపిస్తోంది. ఢీకొన్న తర్వాత అవి అదుపు తప్పి కిందకు దూసుకెళ్లి కూలిపోయాయి. అయితే ప్రమాదానికి కచ్చితమైన కారణం ఏంటన్నది ఇంకా నిర్ధారణ కాలేదు. దీనిపై దర్యాప్తు ప్రారంభించినట్లు ఫిలిప్పీన్స్ వైమానిక దళం ప్రతినిధి కల్నల్ అల్విన్ కాపింగుయాన్ తెలిపారు.
రెండు విమానాలు వైమానిక స్థావరం పరిధిలోనే కూలిపోయాయని, ఇతరులెవరూ ప్రాణాలు కోల్పోలేదని అధికారులు వెల్లడించారు. ప్రమాదం నేపథ్యంలో ఎస్ఎఫ్-260 రకం విమానాలన్నింటి వినియోగాన్ని తాత్కాలికంగా నిలిపివేశారు. దర్యాప్తు పూర్తయ్యే వరకు ఈ నిర్ణయం అమల్లో ఉంటుందని తెలిపారు.
ఫిలిప్పీన్స్‌లో సైనిక విమానాలు ప్రమాదాలకు గురవడం ఇటీవలి కాలంలో పలుమార్లు చోటుచేసుకుంది. ఈ ఏడాది మేలో ఉత్తర ఫిలిప్పీన్స్‌లోని బెంగ్వెట్ ప్రావిన్స్‌లో శిక్షణ విమానం కూలిపోవడంతో ఇద్దరు సైనిక పైలట్లు మరణించారు. 2023లోనూ ఎస్ఎఫ్-260 విమాన ప్రమాదంలో ఇద్దరు పైలట్లు ప్రాణాలు కోల్పోయారు. తాజా ఘటనతో సైనిక విమానాల శిక్షణ భద్రతపై మరోసారి ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.