బంగ్లాదేశ్ జైళ్లలో మగ్గుతున్న భారతీయులు.. శిక్ష పూర్తయినా విడుదలలో జాప్యం
- బంగ్లాదేశ్ జైళ్లలో 400 మందికి పైగా విదేశీ ఖైదీలు
- వీరిలో సగానికి పైగా భారతీయులే.. మొత్తం 238 మంది
- శిక్ష పూర్తయినా 168 మంది విడుదల కాలేదని మీడియా కథనం
- గుర్తింపు వివరాలు సరిగా లేవంటున్న భారత రాయబార కార్యాలయం
- ఖైదీల విడుదలలో జాప్యంతో బంగ్లా ప్రభుత్వానికి అదనపు భారం
బంగ్లాదేశ్‌లోని వివిధ జైళ్లలో డ్రగ్స్, మానవ అక్రమ రవాణా, బంగారం స్మగ్లింగ్ వంటి తీవ్రమైన నేరారోపణలపై 407 మంది విదేశీయులు శిక్ష అనుభవిస్తున్నారు. వీరిలో సగానికి పైగా భారతీయులే ఉండటం గమనార్హం. శిక్షాకాలం పూర్తయినప్పటికీ, గణనీయమైన సంఖ్యలో భారతీయులు ఇంకా జైళ్లలోనే మగ్గుతుండటం ఆందోళన కలిగిస్తోంది.
బంగ్లాదేశ్‌కు చెందిన ప్రముఖ ఆంగ్ల దినపత్రిక 'ది డైలీ స్టార్' కథనం ప్రకారం, ఆ దేశంలోని వివిధ జైళ్లలో మొత్తం 238 మంది భారతీయ ఖైదీలు ఉన్నారు. వీరిలో 168 మంది ఇప్పటికే తమ శిక్షాకాలాన్ని పూర్తి చేసుకున్నప్పటికీ, స్వదేశానికి పంపే ప్రక్రియలో జాప్యం కారణంగా వారు ఇంకా నిర్బంధంలోనే కొనసాగుతున్నారు.
అయితే, ఈ గణాంకాలపై ఢాకాలోని భారత హైకమిషన్ భిన్నమైన వివరణ ఇచ్చింది. శిక్షాకాలం ముగిసి, స్వదేశానికి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్న ధ్రువీకరించబడిన భారతీయుల సంఖ్య కేవలం 25 మాత్రమేనని హైకమిషన్‌లోని కాన్సులర్ వింగ్ అధికారి ఒకరు స్పష్టం చేశారు. బంగ్లాదేశ్ విదేశాంగ శాఖ మొత్తం 121 మంది ఖైదీల జాబితాను పంపినప్పటికీ, అందులోని పలువురి వ్యక్తిగత వివరాలు అసంపూర్ణంగా ఉండటంతో జాతీయతను నిర్ధారించడం సవాలుగా మారిందని ఆయన పేర్కొన్నారు. సదరు ఖైదీలను కలిసేందుకు అనుమతి కోరామని, బంగ్లా విదేశాంగ శాఖ స్పందన కోసం వేచి చూస్తున్నామని ఆయన వివరించారు.
భారతీయుల తర్వాత మయన్మార్‌కు చెందిన వారు 133 మందితో రెండో స్థానంలో ఉన్నారు. వీరితో పాటు నైజీరియాకు చెందిన ఆరుగురు, పాకిస్థాన్, మలేషియా దేశాలకు చెందిన వారు ముగ్గురు చొప్పున బంగ్లా జైళ్లలో ఉన్నారు. భద్రతా కారణాల దృష్ట్యా విదేశీ ఖైదీలను ప్రత్యేక సెల్‌లలో ఉంచి, సీసీటీవీ కెమెరాల ద్వారా నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. శిక్ష పూర్తయినప్పటికీ ఖైదీలు విడుదల కాకపోవడతో నిర్వహణాపరమైన ఇబ్బందులు ఎదురవుతున్నాయని, ఇది ప్రభుత్వంపై అదనపు ఆర్థిక భారాన్ని మోపుతోందని జైలు అధికారులు చెబుతున్నారు.