టీ20 ప్రపంచకప్ సూపర్ 8.. అంపైర్లను ప్రకటించిన ఐసీసీ

Bryan Bennett T20 World Cup sensation undefeated batter
టీ20 ప్రపంచకప్ 2026 సూపర్ 8 దశకు అంపైర్లు, మ్యాచ్ అధికారుల జాబితాను అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) శుక్రవారం ప్రకటించింది. ఈ కీలక దశలో మ్యాచ్ రిఫరీల బృందంలో భారత మాజీ పేసర్ జవగళ్ శ్రీనాథ్‌కు చోటు దక్కింది.

కొలంబో వేదికగా నేడు న్యూజిలాండ్, పాకిస్థాన్ మధ్య జరగనున్న తొలి సూపర్ 8 మ్యాచ్‌కు రాడ్నీ టక్కర్, పాల్ రీఫిల్ ఆన్-ఫీల్డ్ అంపైర్లుగా వ్యవహరించనున్నారు. అల్లావుద్దీన్ పాలేకర్ టీవీ అంపైర్‌గా, సామ్ నొగాజ్‌స్కీ ఫోర్త్ అంపైర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తారు.

ఫిబ్రవరి 22న భారత్- దక్షిణాఫ్రికాతో జరిగే మ్యాచ్‌కు అనుభవజ్ఞులైన రిచర్డ్ కెటిల్‌బరో, క్రిస్ గఫానీ అంపైర్లుగా ఉంటారు. 26న జింబాబ్వేతో మ్యాచ్‌కు అలెక్స్ వార్ఫ్, కెటిల్‌బరో; మార్చి 1న వెస్టిండీస్‌తో జరిగే మ్యాచ్‌కు గఫానీ, వార్ఫ్ అంపైర్లుగా వ్యవహరిస్తారు. భారత్‌కు చెందిన నితిన్ మీనన్ కూడా శ్రీలంకలో జరిగే కొన్ని మ్యాచ్‌లకు అంపైర్‌గా ఎంపికయ్యారు.

మొత్తం సూపర్ 8 దశకు రంజన్ మదుగలె, ఆండ్రూ పైక్రాఫ్ట్, రిచీ రిచర్డ్‌సన్‌తో పాటు జవగళ్ శ్రీనాథ్ మ్యాచ్ రిఫరీలుగా బాధ్యతలు పంచుకోనున్నారు. గ్రూప్ దశలో అజేయంగా నిలిచిన జట్లు సూపర్ 8లో తలపడనుండటంతో టోర్నీ ఆసక్తికరంగా మారింది.
Go Back to Shorts
Zimbabwe cricket
T20 World Cup
undefeated batter
cricket record
Sikandar Raza
T20 World Cup 2026
Zimbabwe team
cricket

More Telugu News