భోగాపురం ఎయిర్ పోర్ట్ నుంచి ఎయిరిండియా ఫ్లైట్ షెడ్యూల్ ఇదే!
- రేపు భోగాపురం ఎయిర్ పోర్ట్ కు ప్రధాని చేతుల మీదుగా ప్రారంభోత్సవం
- భోగాపురం ఎయిర్‌పోర్ట్ నుంచి విమాన సర్వీసుల షెడ్యూల్ విడుదల
- ఆగస్టు 17 నుంచి ఎయిరిండియా సర్వీసులు ప్రారంభం
- హైదరాబాద్, బెంగళూరు, విజయవాడకు విమానాలు
- హైదరాబాద్‌కు రోజుకు 5, విజయవాడకు 4 సర్వీసులు
ఉత్తరాంధ్ర ప్రజలు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి విమాన సర్వీసులు ప్రారంభం కానున్నాయి. ఈ విమానాశ్రయం నుంచి హైదరాబాద్, బెంగళూరు, విజయవాడ నగరాలకు సర్వీసులు నడపనున్నట్టు ప్రముఖ విమానయాన సంస్థ ఎయిరిండియా ప్రకటించింది. ఈ ఆధునిక విమానాశ్రయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ రేపు (ఆగస్టు 1) ప్రారంభించనుండగా... ఆగస్టు 17వ తేదీ నుంచి విమాన సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి.
ఈ నేపథ్యంలో ఎయిరిండియా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 24 వరకు వర్తించేలా తన తాత్కాలిక షెడ్యూల్‌ను విడుదల చేసింది. ఈ షెడ్యూల్ ప్రకారం, భోగాపురం-హైదరాబాద్ మధ్య రోజుకు 5 విమాన సర్వీసులు నడుస్తాయి.
అలాగే, భోగాపురం-విజయవాడ మధ్య రోజుకు 4 సర్వీసులను, భోగాపురం-బెంగళూరు మధ్య రోజుకు 2 సర్వీసులను నడపనున్నట్టు ఎయిరిండియా వెల్లడించింది. బెంగళూరుకు ఆదివారం, శుక్రవారం మినహా మిగిలిన ఐదు రోజుల్లో అదనంగా మరో సర్వీసు కూడా ఉంటుందని స్పష్టం చేసింది. భోగాపురం విమానాశ్రయం కార్యకలాపాలు ప్రారంభం కానుండటంతో, ఉత్తరాంధ్ర వాసులకు ప్రధాన నగరాలకు వేగవంతమైన ప్రయాణ సౌకర్యం కలగనుంది.