ఆస్ట్రేలియా మంత్రికి స్వాగతం పలికిన నారా లోకేశ్... రేపు కీలక ఒప్పందాలు
- ఆంధ్రప్రదేశ్‌లో పర్యటిస్తున్న ఆస్ట్రేలియా సహాయ మంత్రి జూలియన్ హిల్
- గన్నవరం ఎయిర్‌పోర్టులో ఘన స్వాగతం పలికిన మంత్రులు లోకేశ్, టీజీ భరత్
- అంతర్జాతీయ విద్య, పెట్టుబడులే ప్రధాన అజెండాగా చర్చలు
- భాగస్వామ్యం బలోపేతంపై ఆశాభావం వ్యక్తం చేసిన మంత్రి లోకేశ్
ఆంధ్రప్రదేశ్, ఆస్ట్రేలియా మధ్య ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసే దిశగా కీలక అడుగు పడింది. ఆస్ట్రేలియా అంతర్జాతీయ విద్య, పౌరసత్వ వ్యవహారాల సహాయ మంత్రి జూలియన్ హిల్ శుక్రవారం ఆంధ్రప్రదేశ్‌లో పర్యటనకు విచ్చేశారు. గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న ఆయనకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఘన స్వాగతం లభించింది.
రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్, పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ కలిసి జూలియన్ హిల్‌కు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. ఈ పర్యటన వివరాలను మంత్రి లోకేశ్ తన ఎక్స్ ఖాతా ద్వారా వెల్లడించారు. ఆస్ట్రేలియా మంత్రితో జరగనున్న చర్చలు ఫలవంతం అవుతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
అంతర్జాతీయ విద్య, నైపుణ్యాలు, ఆవిష్కరణలు, పెట్టుబడుల వంటి కీలక రంగాల్లో ఇరుపక్షాల మధ్య భాగస్వామ్యాన్ని మరింత పటిష్ఠం చేసుకోవడంపై ఈ పర్యటనలో ప్రధానంగా దృష్టి సారించనున్నట్లు లోకేశ్ తెలిపారు. ఈ పర్యటన ద్వారా ఏపీ, ఆస్ట్రేలియా మధ్య సహకారం కొత్త పుంతలు తొక్కుతుందని అధికారులు భావిస్తున్నారు.