పీఎఫ్ చందాదారులకు గుడ్ న్యూస్... ఇకపై యూపీఐతో క్లెయిమ్స్
- నెల రోజుల్లో బీమ్-యూపీఐ ద్వారా పీఎఫ్ క్లెయిమ్స్
- డబ్బులు నేరుగా యూపీఐ లింక్డ్ ఖాతాల్లోకి జమ
- వివరాలు వెల్లడించిన సెంట్రల్ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్
- దాదాపు అదే రోజు క్లెయిమ్స్ సెటిల్ చేయడమే లక్ష్యం
- గిగ్ వర్కర్లకు సామాజిక భద్రతపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని వెల్లడి
ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్ఓ) తన సేవలను ఆధునికీకరించే దిశగా మరో కీలక అడుగు వేస్తోంది. పీఎఫ్ క్లెయిమ్స్‌లను 'భీమ్' యాప్ ద్వారా పరిష్కరించేలా నూతన విధానాన్ని ప్రవేశపెడుతోంది. ఈ సౌకర్యం నెల రోజుల్లోనే అందుబాటులోకి వస్తుందని సెంట్రల్ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్ రమేష్ కృష్ణమూర్తి శుక్రవారం వెల్లడించారు.
ఈ నూతన విధానం ద్వారా ఈపీఎఫ్ఓ సభ్యులు తమ క్లెయిమ్ లను భీమ్ యాప్ ద్వారా సమర్పించవచ్చని, సెటిల్ అయిన మొత్తం నేరుగా వారి యూపీఐ అనుసంధిత బ్యాంకు ఖాతాల్లో జమ అవుతుందని ఆయన వివరించారు. దీనివల్ల క్లెయిమ్స్ ప్రక్రియ మరింత వేగంగా, సులభతరంగా మారుతుందని పేర్కొన్నారు.
ఉద్యోగులు, యాజమాన్యాలకు మెరుగైన సేవలను అందించే లక్ష్యంతో ఈపీఎఫ్ఓ ఈ సంస్కరణలు చేపట్టింది. క్లెయిమ్ పరిష్కారంలో గతంలో ఉన్న జాప్యాన్ని ఇప్పటికే అధిగమించామని, ఆటో-సెటిల్‌మెంట్ రేట్లు 90 శాతానికి చేరిందని కృష్ణమూర్తి తెలిపారు. భవిష్యత్తులో వచ్చే క్లెయిమ్స్‌లను వీలైనంత వరకు అదే రోజు లేదా గరిష్ఠంగా రెండు రోజుల్లోపు పరిష్కరించడమే తమ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.
గిగ్, ప్లాట్‌ఫామ్ వర్కర్లకు సామాజిక భద్రత కల్పించేందుకు ప్రభుత్వం త్వరలో ప్రత్యేక పథకాన్ని ప్రకటించనుందని కృష్ణమూర్తి వెల్లడించారు. ఈ బాధ్యతను ఈపీఎఫ్ఓ లేదా మరో ఏజెన్సీకి అప్పగించే అవకాశం ఉందని తెలిపారు. రాబోయే రోజుల్లో యాజమాన్యాలకు నిబంధనల అమలును మరింత సరళతరం చేస్తామని, సామాజిక భద్రత కల్పనలో ఈపీఎఫ్ఓపై ఉన్న నమ్మకాన్ని మరింత బలోపేతం చేస్తామని ఆయన భరోసా ఇచ్చారు.