Rajinikanth: రజనీకాంత్ 'కొచ్చాడయాన్'కు ఏఐ హంగులు

Rajinikanth Kochadaiiyaan Gets AI Enhancements
షార్ట్స్‌లో చూడండి
సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నటించిన మూవీ కొచ్చాడయాన్. 2014లో విడుదలైన ఈ యాక్షన్ - అడ్వెంచర్ మూవీ బాక్సాఫీస్ వద్ద అభిమానులను ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయింది. బాలీవుడ్ భామ దీపికా పదుకొణె  ఇందులో హీరోయిన్‌గా కనిపించింది. 

మోషన్ క్యాప్చర్ టెక్నాలజీతో తెరకెక్కిన ఈ మూవీ అప్పట్లో విస్తృత చర్చకు దారి తీసింది. విజువల్స్ కార్టూన్ సినిమాను తలపిస్తున్నాయంటూ ప్రేక్షకుల నుంచి విమర్శలు, ట్రోల్స్ కూడా ఎదురయ్యాయి. 

అయితే తాజాగా ఈ మూవీకి సరికొత్త హంగులతో టీజర్ విడుదలైంది. ఏఐ సాయంతో రూపొందించిన ఈ టీజర్ తలైవా అభిమానులను ఆకట్టుకుంటోంది. అంతేకాదు, మొత్తం సినిమాన్నే ఏఐ టెక్నాలజీతో రీ - జనరేట్ చేసే ప్రయత్నాలు సాగుతున్నట్లు సమాచారం.ఈ చిత్రానికి రజినీకాంత్ కూతురు సౌందర్య రజినీకాంత్ దర్శకత్వం వహించిన విషయం విదితమే.
 
Go Back to Shorts
Rajinikanth
Kochadaiiyaan
Deepika Padukone
Soundarya Rajinikanth
AI technology
Motion capture
Telugu cinema
Kollywood
Movie remaster
Artificial intelligence

More Telugu News