Four Stars of Destiny: మాజీ ఆర్మీ చీఫ్ నరవణె పుస్తకం లీక్.. కేసు నమోదు చేసిన ఢిల్లీ పోలీసులు
- మాజీ ఆర్మీ చీఫ్ జనరల్ నరవణె పుస్తకంపై లీకేజీ కలకలం
- ఆమోదం రాకముందే ఆన్‌లైన్‌లో 'ఫోర్ స్టార్స్ ఆఫ్ డెస్టినీ'
- కొన్ని వెబ్‌సైట్లలో పీడీఎఫ్ కాపీ ప్రత్యక్షం
- కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న ఢిల్లీ పోలీసుల స్పెషల్ సెల్ విభాగం
భారత సైన్య మాజీ అధిపతి జనరల్ ఎంఎం నరవణె రాసిన పుస్తకం ప్రచురణకు ముందే ఆన్‌లైన్‌లో లీక్ కావడం తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనపై ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 'ఫోర్ స్టార్స్ ఆఫ్ డెస్టినీ' పేరుతో జనరల్ నరవణె తన ఆత్మకథను రాశారు. అయితే, ఈ పుస్తకం ప్రచురణకు ఇంకా సంబంధిత అధికారుల నుంచి అవసరమైన అనుమతులు రాలేదని తెలిసింది.
ఇంతలోనే ఈ పుస్తకం ప్రీ-ప్రింట్ కాపీ సోషల్ మీడియా, ఆన్‌లైన్ న్యూస్ ఫోరమ్‌లలో సర్క్యులేట్ అవుతున్నట్లు పోలీసుల దృష్టికి వచ్చింది. దీనిపై ప్రాథమిక విచారణ జరపగా, కొన్ని వెబ్‌సైట్లలో ఈ పుస్తకం పీడీఎఫ్ కాపీ అందుబాటులో ఉన్నట్లు గుర్తించారు. ప్రముఖ ప్రచురణ సంస్థ పెంగుయిన్ రాండమ్ హౌస్ ఇండియా తయారు చేసినట్లుగా ఈ పీడీఎఫ్ ఉంది. అంతేకాకుండా కొన్ని ఆన్‌లైన్ మార్కెటింగ్ వేదికలు ఈ పుస్తకం ముఖచిత్రాన్ని ప్రదర్శిస్తూ, కొనుగోలుకు సిద్ధంగా ఉన్నట్లు చూపించడం పోలీసులను ఆశ్చర్యపరిచింది.
ప్రచురణకు అనుమతులు రాకముందే అత్యంత కీలకమైన పుస్తకం ఎలా లీక్ అయిందనే దానిపై సమగ్రంగా దర్యాప్తు చేసేందుకు ఢిల్లీ పోలీసుల స్పెషల్ సెల్ విభాగంలో కేసు నమోదు చేశారు. ఈ లీకేజీ వెనుక ఎవరున్నారనే కోణంలో విచారణ జరుపుతున్నట్లు అధికారులు తెలిపారు.