అభిజిత్ దీప్కేపై.. బెర్లిన్‌లో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ కీలక వ్యాఖ్యలు
- భారత్‌లో ప్రతిభావంతులను ఆకర్షించే విధానాలకు దీప్కే వంటి వారు అడ్డుపడతారని వ్యాఖ్య
- వాతావరణ సంక్షోభానికి అభివృద్ధి చెందిన దేశాలే కారణమంటూ యూరప్‌ను నిలదీత
- యూరప్ కార్బన్ పన్ను విధానం వారి జీవన వ్యయాన్నే పెంచుతుందని హెచ్చరిక
- భారత ప్రతిభావంతులు మాతృభూమికి తిరిగి రావాలని విద్యార్థులకు పిలుపు
కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తన జర్మనీ పర్యటనలో కీలక వ్యాఖ్యలు చేశారు. బెర్లిన్‌లో భారతీయ విద్యార్థులతో ముచ్చటించిన ఆయన, కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కేను ఉద్దేశించి విమర్శలు గుప్పించారు. అదే సమయంలో, వాతావరణ మార్పుల అంశంలో యూరప్ దేశాల వైఖరిని ఆయన గట్టిగా నిలదీశారు.
విదేశాల్లో ఉన్న భారతీయ ప్రతిభావంతులను తిరిగి స్వదేశానికి ఆకర్షించేందుకు ప్రభుత్వం చేపడుతున్న చర్యలపై బెర్లిన్‌లో సైన్స్ అండ్ టెక్నాలజీ విద్యార్థులతో గోయల్ చర్చించారు. ఈ సందర్భంగా చైనా అనుసరిస్తున్న విధానాలను ప్రస్తావిస్తూ, "ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ చూసినా భారతీయ ప్రతిభ కనిపిస్తుంది. వారిని తిరిగి ఎలా ఆకర్షించాలనే దానిపై దృష్టి సారించాలి. అయితే, ఈ ప్రక్రియలో నిధుల దుర్వినియోగం జరగకుండా జాగ్రత్త వహించాలి. చైనాలో అక్రమాలు జరిగితే మనుషులు మాయమవుతారు, అదే మన దేశంలో జరిగితే మంత్రిగా నేనే మాయమైపోతాను" అంటూ చమత్కరించారు.
భారత్‌లోనూ చైనా తరహా కార్యక్రమాలను అమలు చేస్తారా? అని ఒక విద్యార్థి అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిస్తూ "అది మంచి ఆలోచనే, కానీ అక్కడే నియంతృత్వానికి, ప్రజాస్వామ్యానికి మధ్య వ్యత్యాసం కనిపిస్తుంది. మనం అటువంటి పథకాలను ప్రవేశపెడితే, విద్యార్థులకు నిధులు, స్కాలర్షిప్లు మంజూరు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనంటూ అభిజిత్ దీప్కే వంటి వారు విమర్శలు చేస్తూ మెదళ్లను పాడుచేస్తారు. అందుకే మన ప్రజాస్వామ్య వ్యవస్థకు అనుగుణంగా విధానాలను రూపొందించుకోవాలి" అని పేర్కొన్నారు. నీట్ పేపర్ లీక్, ఓటర్ల జాబితా తారుమారు ఆరోపణలపై అభిజిత్ దీప్కే నేతృత్వంలోని సీజేపీ ఇటీవల నిరసనలు చేపట్టిన విషయం తెలిసిందే.
ఈ సందర్భంగా, భారతీయ విద్యార్థులు తమ మాతృభూమికి తిరిగి వచ్చి దేశ సేవలో భాగస్వాములు కావాలని గోయల్ పిలుపునిచ్చారు. "మిమ్మల్ని తిరిగి దేశానికి రప్పించాలని మేము ఆకాంక్షిస్తున్నాం. ఇది కేవలం ఆర్థిక ప్రయోజనాలకు సంబంధించిన విషయం మాత్రమే కాదు, ఇది మీ మాతృభూమి. మీ జీవితంలో కొంత సమయాన్ని దేశం కోసం కేటాయించండి" అని ఆయన కోరారు.
తన పర్యటనలో భాగంగా 'బెర్లిన్ గ్లోబల్ డైలాగ్ 2026' సదస్సులో పాల్గొన్న గోయల్, వాతావరణ మార్పుల విషయంలో అభివృద్ధి చెందిన దేశాల బాధ్యతను గుర్తుచేశారు. "ప్రస్తుత పర్యావరణ సంక్షోభానికి అసలు కారకులు ఎవరు? ఓజోన్ పొరకు నష్టం కలిగించింది ఎవరు?" అని ఆయన ప్రశ్నించారు. ప్రపంచ జనాభాలో భారత్ వాటా 17 శాతంగా ఉన్నప్పటికీ, కర్బన ఉద్గారాల్లో మన దేశ వాటా 3 శాతం కంటే తక్కువేనని, అదే తక్కువ జనాభా కలిగిన ఐరోపా దేశాల వాటా మాత్రం చాలా అధికగా ఉందని స్పష్టం చేశారు. యూరప్ అమలు చేస్తున్న కార్బన్ బోర్డర్ అడ్జస్ట్మెంట్ మెకానిజం (సీబీఏఎం) విధానాన్ని విమర్శిస్తూ, "ఈ విధానం ద్వారా ఉక్కు దిగుమతులపై 50 శాతం వరకు సుంకాలు విధిస్తున్నారు. ఇది విపత్తును ఆహ్వానించడమే కాకుండా, మీ దేశాల్లో జీవన వ్యయాన్ని భారీగా పెంచుతుంది" అని హెచ్చరించారు.
అక్టోబర్ 22 నుంచి 27 వరకు జర్మనీ, నెదర్లాండ్స్ దేశాల్లో పర్యటిస్తున్న గోయల్ వెంట సుమారు 100 మంది భారతీయ వ్యాపారవేత్తలు, స్టార్టప్ ప్రతినిధులతో కూడిన బృందం ఉంది.