Jeffrey Epstein: ఎప్‌స్టీన్ మరణ ప్రకటనను అతడు చనిపోవడానికి ముందే రూపొందించారా?

Jeffrey Epstein Death Announcement Drafted Before Actual Death
షార్ట్స్‌లో చూడండి
సెక్స్ రాకెట్ సూత్రధారి జెఫ్రీ ఎప్‌స్టీన్ మృతి చెందడానికి ఒకరోజు ముందు అతని మరణ ప్రకటన సిద్ధం చేశారా? అంటే అవుననే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎప్‌స్టీన్ 2019 ఆగస్టు 10వ తేదీన అనుమానాస్పద స్థితిలో మాన్‌హట్టన్ జైలులో మృతి చెందాడు. అయితే, అతడి మరణ ప్రకటన ఒకరోజు ముందే తయారు చేసినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అమెరికా న్యాయశాఖ తాజాగా విడుదల చేసిన ఫైళ్లలో ఆ తేదీ ఆగస్టు 9గా ఉండటం గమనార్హం.

ఎప్‌స్టీన్ జైలు గదిలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు నాడు అధికారులు వెల్లడించారు. కానీ అతడి మరణంపై నాటి నుంచి అనుమానాలు వ్యక్తమవుతూనే ఉన్నాయి.

ఎప్‌స్టీన్ మరణించడానికి ఒకరోజు ముందు ఆరెంజ్ దుస్తులు ధరించిన ఒక వ్యక్తి ఎప్‌స్టీన్ జైలు గది వైపు కదులుతున్నట్లుగా సీసీటీవీ దృశ్యాలు వెలుగు చూశాయి. ఆ కదులుతున్న వ్యక్తి జైలు అధికారి అని న్యాయశాఖ చెబుతోంది.

ఎప్‍‌స్టీన్ చనిపోయాడని గుర్తించిన తర్వాత తీసిన ఫొటోలను తాజాగా బహిర్గతం చేశారు. అతడు మరణించాడని గుర్తించిన 16 నిమిషాల తర్వాత బతికించేందుకు వైద్యులు ప్రయత్నిస్తున్నట్లుగా ఆ చిత్రంలో ఉంది. అతడు మృతి చెందాడని ధృవీకరించిన అనంతరం ఆసుపత్రిలో తీసిన ఫొటోల్లో పేరును తప్పుగా రాశారు. ఇవి పలు అనుమానాలకు తావిస్తున్నాయి.
Go Back to Shorts
Jeffrey Epstein
Epstein death
Epstein suicide
Manhattan jail
Sex trafficking
US Department of Justice

More Telugu News