Prabhas: స్పిరిట్ మూవీ నుంచి ప్రకాశ్ రాజ్ తప్పుకున్నారా..?

Prabhas Spirit Movie Prakash Raj Exit Rumors
షార్ట్స్‌లో చూడండి
ప్రభాస్, సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్‌లో రూపొందుతున్న ‘స్పిరిట్’ నుంచి తాజాగా ఓ కీలక వార్త సోషల్ మీడియాలో హాల్ చల్ చేస్తోంది. ముఖ్యంగా ప్రభాస్ కెరీర్‌లో తొలిసారి ఐపీఎస్ పాత్రలో నటిస్తున్నాడన్న టాక్‌తో ఈ మూవీపై ఆసక్తి మరింత పెరిగింది.  

ఈ సినిమా నుంచి ప్రకాశ్ రాజ్ తప్పుకున్నట్లు పుకార్లు షికారు చేస్తున్నాయి. గతంలో ప్రభాస్ -  ప్రకాశ్ రాజ్ మధ్య సన్నివేశాలతో షూటింగ్ కూడా మొదలైందని టాక్ వచ్చింది. కానీ ఇప్పుడు తాజాగా జరుగుతున్న ప్రచారం ప్రకారం.. ప్రకాశ్ రాజ్ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇందులో నిజమెంత అన్నది ఇంకా అధికారికంగా తెలియాల్సి ఉంది. 

గతంలో విడుదలైన వాయిస్ టీజర్ ద్వారా ప్రకాశ్ రాజ్ పాత్రకు సినిమాలో కీలక ప్రాధాన్యం ఉంటుందని అభిమానులు భావించారు. ఈ నేపథ్యంలో ఆయన తప్పుకున్నారనే వార్త నిజమైతే మూవీపై ప్రభావం పడే అవకాశం ఉందని సినీ వర్గాలు భావిస్తున్నాయి. మరి ఈ వదంతులపై మేకర్స్ ఎలా స్పందిస్తారో చూడాలి. ఇక ఈ క్రేజీ ప్రాజెక్ట్ విడుదల తేదీ విషయానికి వస్తే.. 2027 మార్చి 5న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల చేయనున్నట్లు ఇప్పటికే చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది.
 
ఈ మూవీలో ప్రభాస్ సరసన తృప్తి దిమ్రి హీరోయిన్‌గా నటిస్తుండగా, బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ కీలక పాత్రలో కనిపించనున్నాడు. ఈ మూవీకి హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందిస్తుండగా, భద్రకాళి పిక్చర్స్, టీ - సిరీస్ బ్యానర్లపై నిర్మాణం జరుగుతోంది.
Go Back to Shorts
Prabhas
Spirit Movie
Sandeep Reddy Vanga
Prakash Raj
Tollywood
Pan India Movie
Trisha Krishnan
Vivek Oberoi
Harshavardhan Rameshwar
Bhadrakali Pictures

More Telugu News