Uttar Pradesh: ప్రమాదవశాత్తు బిగిసిన ఉరి.. రీల్ చేస్తుండగా మహిళ మృతి

UP Woman 27 Accidentally Hangs Herself While Filming Reel
  • మ‌హిళ‌ ప్రాణం తీసిన సోషల్ మీడియా రీల్ మోజు 
  • ఉరి వేసుకుంటున్నట్లు నటిస్తూ ప్రమాదవశాత్తూ మృతి
  • ఉత్తరప్రదేశ్‌లోని బాందా జిల్లాలో జరిగిన విషాద ఘటన
సోషల్ మీడియా రీల్స్ మోజు, లైకుల పిచ్చి యువతను ఎంత ప్రమాదంలోకి నెడుతోందో చెప్పడానికి ఉత్తరప్రదేశ్‌లో జరిగిన ఈ ఘటనే నిదర్శనం. సరదా కోసం చిత్రీకరించాలనుకున్న ఓ దృశ్యం చివరకు విషాదాంతమై, ఓ యువతి ప్రాణాలను బలిగొంది.

వివరాల్లోకి వెళితే... ఉత్తరప్రదేశ్‌లోని బాందా జిల్లాకు చెందిన 27 ఏళ్ల మోహిని అనే మహిళకు సోషల్ మీడియాలో రీల్స్ చేయడం అలవాటు. ఈ క్రమంలోనే తన ఇంట్లో ఉరి వేసుకుంటున్నట్లు నటించే సన్నివేశాన్ని చిత్రీకరించాలని నిర్ణయించుకుంది. దీనికోసం మెడకు తాడు బిగించుకుని ఓ స్టూల్‌పై నిల్చుని తన మొబైల్ ఫోన్‌లో వీడియో రికార్డ్ చేయడం ప్రారంభించింది.

అయితే, కొన్ని క్షణాల్లోనే సీన్ రివర్స్ అయింది. ఆమె బ్యాలెన్స్ కోల్పోవడం లేదా కాలు జారడంతో స్టూల్ పక్కకు పడిపోయింది. దీంతో మెడకు బిగిసిన ఉరి నిజంగానే ఆమె ప్రాణాలను క్షణాల్లో తీసేసింది.

ఈ విషయాన్ని మొదట గమనించింది ఆమె నాలుగేళ్ల కుమార్తె. గదిలోకి వచ్చిన చిన్నారి, తల్లి ఉరికి వేలాడుతూ కనిపించడంతో గట్టిగా కేకలు వేసింది. ఆ అరుపులు విన్న ఇరుగుపొరుగు వారు అక్కడికి పరుగెత్తుకొచ్చి, దృశ్యం చూసి దిగ్భ్రాంతికి గురయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నప్పటికీ, రీల్ చిత్రీకరిస్తుండగా జరిగిన ప్రమాదంగానే భావిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
Uttar Pradesh
Social Media Reels
Mohini
Reels Accident
Banda District
Viral Videos
Instagram Reels
Accidental Death
Video Recording
India News

More Telugu News