Celina Jaitly: నిన్ను తీసుకురావడానికి కొండలనైనా కదిలిస్తా.. సోదరుడి కోసం నటి సెలీనా జైట్లీ కన్నీటి పోరాటం!
- 16 నెలలుగా అరబ్ జైల్లోనే మాజీ మేజర్ విక్రాంత్
- ఢిల్లీ హైకోర్టు ఆదేశాలతో చిగురించిన ఆశలు
- ప్రధాని మోదీ జోక్యం కోరిన నటి సెలీనా
"నిన్ను తిరిగి మన దేశానికి తీసుకురావడానికి నేను కొండలనైనా కదిలిస్తాను".. తన సోదరుడు, రిటైర్డ్ ఆర్మీ మేజర్ విక్రాంత్ జైట్లీని ఉద్దేశించి బాలీవుడ్ నటి సెలీనా జైట్లీ చేసిన ఈ భావోద్వేగ ప్రకటన ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. భారత సైన్యంలోని పారా స్పెషల్ ఫోర్సెస్ అధికారిగా దేశానికి సేవలందించిన విక్రాంత్, గత 16 నెలలుగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో నిర్బంధంలో ఉన్నారు.
2024 సెప్టెంబర్‌లో దుబాయ్‌లోని ఒక మాల్‌లో విక్రాంత్‌ను గుర్తుతెలియని వ్యక్తులు అదుపులోకి తీసుకోవడంతో ఈ విషాదం మొదలైంది. తొమ్మిది నెలల పాటు ఆయన ఎక్కడున్నారో కూడా తెలియని స్థితిలో కుటుంబం అల్లాడిపోయింది. ప్రస్తుతం అబుదాబిలోని అల్-వత్బా డిటెన్షన్ సెంటర్‌లో ఉన్న ఆయనపై ‘జాతీయ భద్రత’ అనే అస్పష్టమైన ఆరోపణలు తప్ప, ఇంతవరకు ఎలాంటి చార్జ్‌షీట్ దాఖలు చేయలేదు. "ఒక దేశం కోసం తన యవ్వనాన్ని ధారబోసిన సైనికుడికి దక్కాల్సిన గౌరవం ఇదేనా?" అని సెలీనా కన్నీటి పర్యంతమయ్యారు.
ఈ కేసులో ఢిల్లీ హైకోర్టు తాజాగా కీలక ఆదేశాలు జారీ చేసింది. విక్రాంత్ తరఫున వాదించడానికి ఒక ప్రత్యేక న్యాయ సంస్థను నియమించాలని విదేశాంగ మంత్రిత్వ శాఖను ఆదేశించింది. ఈ సంస్థ ఉచితంగా సేవలు అందించేందుకు సిద్ధంగా ఉండటం విశేషం. వియన్నా ఒప్పందం ప్రకారం ఒక భారతీయ పౌరుడికి దక్కాల్సిన న్యాయ సహాయాన్ని తక్షణమే అందించాలని కోర్టు స్పష్టం చేసింది.
గతంలో ఖతార్‌లో మరణశిక్ష పడిన భారత నావికాదళ అధికారులను కేంద్ర ప్రభుత్వం ఎలాగైతే క్షేమంగా తీసుకువచ్చిందో, అదే తరహాలో ప్రధాని నరేంద్ర మోదీ తన సోదరుడి విషయంలోనూ జోక్యం చేసుకోవాలని సెలీనా వేడుకున్నారు. ఈ కష్టకాలంలో తన ఆర్థిక పరిస్థితి దెబ్బతిందని, తన వైవాహిక జీవితంలోనూ సమస్యలు తలెత్తాయని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఏది ఏమైనా, తన సోదరుడిని భారత్ తీసుకువచ్చే వరకు విశ్రమించబోనని ఆమె ప్రతిన బూనారు.