Balochistan Liberation Army: బలూచిస్థాన్‌లో పాక్‌కు చుక్కలు.. అట్టర్‌ఫ్లాప్ అయిన ఐఎస్ఐ ప్లాన్
- బీఎల్ఏపై ఉగ్రవాదులను ప్రయోగించాలన్న పాక్ సైన్యం ప్లాన్ ఫెయిల్
- బలూచిస్థాన్‌లో 40 గంటలకు పైగా బీఎల్ఏ దాడుల బీభత్సం
- ప్రజా ఉద్యమంగా మారిన బలూచ్ పోరాటం.. వెనకడుగు వేస్తున్న ఉగ్రసంస్థలు
- దాడుల్లో మహిళల భాగస్వామ్యం.. ఐఎస్ఐ హెడ్‌క్వార్టర్స్‌పై ఆత్మాహుతి దాడి
బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ (బీఎల్ఏ), తెహ్రీక్-ఏ-తాలిబన్ పాకిస్థాన్ (టీటీపీ) లాంటి సాయుధ గ్రూపులను ఎదుర్కోవడం పాకిస్థాన్ సైన్యానికి కత్తిమీద సాములా మారింది. ఈ క్రమంలో పాక్ సైన్యం, దాని గూఢచార సంస్థ ఐఎస్ఐ వేసిన ఓ ఎత్తుగడ దారుణంగా విఫలమైంది. లష్కరే తోయిబా, ఐఎస్‌కేపీ ఉగ్రవాద సంస్థలను ఏకం చేసి బీఎల్ఏపైకి ఉసిగొల్పాలన్న వ్యూహం బెడిసికొట్టింది.
బీఎల్ఏ 'ఆపరేషన్ హీరోఫ్ ఫేజ్ 2' పేరుతో క్వెట్టా సహా పలు ప్రాంతాల్లో భారీ దాడులకు పాల్పడింది. ఈ దాడులు ఏకధాటిగా 40 గంటలకు పైగా కొనసాగాయి. ఈ ఘటనల్లో సుమారు 200 మంది పాకిస్థాన్ సైనికులను మట్టుబెట్టినట్లు బీఎల్ఏ ప్రకటించింది. అయితే, బలూచిస్థాన్ ముఖ్యమంత్రి సర్ఫరాజ్ బుగ్తీ మాత్రం 17 మంది భద్రతా సిబ్బంది, 31 మంది పౌరులు మరణించినట్లు తెలిపారు. ఈ దాడుల తీవ్రతను ఎదుర్కోవడంలో లష్కరే, ఐఎస్‌కేపీ ఉగ్రమూకలు విఫలమవడంతో పాక్ ప్రభుత్వం అంతర్జాతీయంగా పరువు కోల్పోయింది.
బలూచ్ పోరాటం ఇప్పుడు కేవలం ఒక సాయుధ తిరుగుబాటుగా కాకుండా ప్రజా ఉద్యమంగా రూపుదిద్దుకుంటోంది. బలూచ్ ప్రజలు పెద్ద సంఖ్యలో పాక్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడేందుకు ముందుకు వస్తుండటంతో సైన్యానికి పరిస్థితి కష్టంగా మారింది. ఈ పోరాటంలో మహిళలు కూడా పాల్గొనడం గమనార్హం. ఆసిఫా మెంగల్ అనే మహిళ నోష్కిలోని ఐఎస్ఐ ప్రధాన కార్యాలయంపై వాహనంతో ఆత్మాహుతి దాడికి పాల్పడింది. దాడుల్లో మహిళల పాత్ర ఉందని పాక్ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ కూడా అంగీకరించారు.
బీఎల్ఏ కమాండర్ బషీర్ జైర్ బలోచ్ ప్రజలంతా సమీకృతం కావాలని పిలుపునివ్వడం పాక్ ప్రభుత్వానికి మింగుడుపడడం లేదు. ఈ పరిస్థితుల్లో ఉగ్రవాద సంస్థలను ప్రయోగించడం కంటే బలూచ్ నేతలతో చర్చలు జరిపి వారి డిమాండ్లను అంగీకరించడం మేలని కొందరు అధికారులు అభిప్రాయపడుతున్నారు. బీఎల్ఏ దెబ్బకు భయపడి లష్కరే, ఐఎస్‌కేపీ లాంటి సంస్థలు ఈ పోరాటం నుంచి తప్పుకునే అవకాశాలున్నాయని, వాటిలో ఉన్న చాలామందికి ఈ యుద్ధం చేయడం ఇష్టం లేదని తెలుస్తోంది. ఈ ప్రయోగం విఫలం కావడంతో భవిష్యత్తులో జైషే మహ్మద్ లాంటి ఇతర ఉగ్రసంస్థలను రంగంలోకి దించడం దాదాపు అసాధ్యమని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఈ ఓటమి ఉగ్రసంస్థల ప్రతిష్ఠను దెబ్బతీయడమే కాకుండా, కొత్తగా చేరేవారిని కూడా నిరుత్సాహపరుస్తుందని భావిస్తున్నారు.