Padi Kaushik Reddy: పోలీసులకు "సారీ" చెప్పిన పాడి కౌశిక్ రెడ్డి... వీడియో ఇదిగో!

Padi Kaushik Reddy Apologizes to Police for Remarks at Jatara
షార్ట్స్‌లో చూడండి
కరీంనగర్ జిల్లా వీణవంక సమ్మక్క-సారలమ్మ మినీ జాతర సందర్భంగా పోలీసులపై తాను చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి క్షమాపణలు చెప్పారు. ఆవేశంలో నోరు జారానని, ఉద్దేశపూర్వకంగా అనలేదని ఆయన స్పష్టం చేశారు. పోలీసుల మనోభావాలు దెబ్బతిని ఉంటే క్షమించాలని కోరుతూ, ఈ వివాదాన్ని ఇంతటితో ముగించాలని విజ్ఞప్తి చేశారు.

గురువారం రాత్రి వీణవంక జాతరలో దళిత మహిళా సర్పంచ్‌ను కొబ్బరికాయ కొట్టనివ్వలేదని ఆరోపిస్తూ కౌశిక్ రెడ్డి కుటుంబంతో కలిసి నిరసనకు దిగారు. ఈ క్రమంలో పోలీసులతో వాగ్వాదం జరిగి తోపులాట చోటుచేసుకుంది. ఆ సమయంలో కౌశిక్ రెడ్డి పోలీసులపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 

కరీంనగర్ సీపీ గౌస్ ఆలంను ఉద్దేశించి మాట్లాడుతూ, తమ ప్రభుత్వం వచ్చినప్పుడు అంతు చూస్తామని హెచ్చరించారు. ఈ ఘటన తర్వాత పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకుని, పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఐపీఎస్ అధికారుల సంఘం కూడా ఈ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించింది.

ఈ నేపథ్యంలో కౌశిక్ రెడ్డి ఒక వీడియో సందేశం విడుదల చేశారు. "సీఎం ప్రోద్బలంతో నాపై, నా కుటుంబంపై రాజకీయ కక్ష సాధిస్తున్నారు. పోలీసులు, అధికారులంటే నాకు ఎంతో గౌరవం. జాతరకు వెళుతుండగా అడ్డుకుని తీవ్ర ఒత్తిడికి గురిచేశారు. ఆ ఫ్రస్టేషన్‌లో నోరు జారింది. నా వ్యాఖ్యల వల్ల ఎవరి మనోభావాలైనా దెబ్బతింటే క్షమించాలి" అని ఆయన పేర్కొన్నారు. ఈ ఘటన తెలంగాణ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
Go Back to Shorts
Padi Kaushik Reddy
Kaushik Reddy
BRS MLA
Veernavanka
Karimnagar
Telangana Politics
Police Apology
Samakka Saralamma Jatara
Dalit Sarpanch
Gaus Alam

More Telugu News