ఐదు గంటల పాటు జోగినపల్లి సంతోష్ రావు విచారణ
- ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ మాజీ ఎంపీని ప్రశ్నించిన సిట్
- మధ్యాహ్నం 3 గంటల నుంచి ప్రశ్నించిన సిట్
- ఇంటెలిజెన్స్ చీఫ్‌గా ప్రభాకర్ రావు నియామకం నిర్ణయం ఎవరిదని ప్రశ్నించిన సిట్
ప్రభాకర్ రావుకు ఇంటెలిజెన్స్ చీఫ్, ఎస్ఐబీ చీఫ్ బాధ్యతలు అప్పగించడంలో నిర్ణయం, ఆదేశాలు ఎవరు ఇచ్చారనే అంశంపై సంతోష్ రావును సిట్ ప్రశ్నించినట్లు సమాచారం. ఇదిలా ఉండగా, ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ ఇదివరకే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఆ పార్టీ సీనియర్ ఎమ్మెల్యే హరీశ్ రావును విచారించిన విషయం విదితమే.