'మన శంకర వరప్రసాద్ గారు' ... వారం రోజుల వసూళ్లు ఒక రికార్డు అయితే... ఏడో రోజు వసూళ్లు మరో రికార్డు!

Chiranjeevis Mana Shankara Varaprasad Garu Sets New Records in 7 Days
  • వారం రోజుల్లో రూ.292 కోట్లు వసూలు చేసిన ప్రాంతీయ చిత్రం
  • ఏడవ రోజు రూ.31 కోట్ల వసూళ్లు సాధించిన తెలుగు చిత్రం
  • విదేశాలలోను అదరగొడుతున్న 'మన శంకర వరప్రసాద్ గారు'
చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో సంక్రాంతి కానుకగా విడుదలైన 'మన శంకర వరప్రసాద్ గారు' చిత్రం బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన వసూళ్లతో దూసుకుపోతోంది. ఈ చిత్రం విడుదలైన మొదటి వారంలోనే రూ.292 కోట్లు రాబట్టి సరికొత్త రికార్డులు సృష్టించింది. ఒక ప్రాంతీయ చిత్రంగా వారం రోజుల్లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా ఇది నిలిచింది.

జనవరి 12న విడుదలైన ఈ సినిమా నిన్నటితో (18వ తేదీ) ఏడు రోజులు పూర్తి చేసుకుంది. ఏడవ రోజున ఈ చిత్రం రూ.31 కోట్లు వసూలు చేసింది. ఒక తెలుగు సినిమా ఏడవ రోజున ఇంతటి వసూళ్లు సాధించడం ఇదే తొలిసారి. రెండవ వారం ప్రారంభం రోజునే ఈ చిత్రం రూ.300 కోట్ల మార్కును దాటుతుందని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అంటే, నేడు (సోమవారం) ఈ చిత్రం వసూళ్లు రూ.300 కోట్లు దాటే అవకాశం ఉంది.

విదేశాల్లో కూడా ఈ సినిమా భారీగా వసూళ్లు రాబడుతోంది. ఉత్తర అమెరికాలో ఇప్పటివరకు రూ.2.96 మిలియన్ డాలర్లు వసూలు చేసింది. తద్వారా చిరంజీవి కెరీర్‌లో అక్కడ 3 మిలియన్ల డాలర్లు వసూలు చేసిన తొలి చిత్రంగా 'మన శంకర వరప్రసాద్ గారు' రికార్డు సృష్టించనుంది.

అనిల్ రావిపూడి దర్శకత్వంలో గత సంవత్సరం విడుదలైన చిత్రం 'సంక్రాంతికి వస్తున్నాం' రూ.200 కోట్ల క్లబ్‌లో చేరిన విషయం తెలిసిందే. ఈ సినిమాతో వరుసగా రెండు సంవత్సరాలలో రూ.200 కోట్ల క్లబ్‌లో చేరిన చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడిగా అనిల్ రావిపూడి నిలిచారు.
Go Back to Shorts
Chiranjeevi
Mana Shankara Varaprasad Garu
Anil Ravipudi
Telugu Movie Collections
Sankranti Release

More Telugu News