శబరిమల నుంచి వస్తుండగా కన్యాకుమారి వద్ద తెలుగు దంపతుల మృతి
- మృతులు లక్సెట్టిపేటకు చెందిన సత్యనారాయణ, రమాదేవి
- నిన్న అయ్యప్ప స్వామిని దర్శించుకున్న దంపతులు
- కన్యాకుమారిలో ప్రైవేట్ వాహనం ఢీకొని మృతి
ఈ క్రమంలో కన్యాకుమారి వద్ద బైపాస్ రోడ్డులో బస్సును ఆపారు. అక్కడ సముద్ర స్నానం ముగించుకుని బస్సు దగ్గరకు వస్తుండగా సత్యనారాయణ, రమాదేవిని ఓ ప్రైవేట్ వాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరూ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. వీరి మృతదేహాలను పోలీసులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.