ప్రధాన్‌పై కేంద్రం తొలి ప్రతిపాదన ఇదే.. కానీ సీజేపీ ఒప్పుకోలేదట!
- ప్రధాన్ శాఖ మార్పు ప్రతిపాదన
- సీజేపీ తిరస్కరించినట్లు సమాచారం
- రాజీనామాపైనే సీజేపీ పట్టు
- రాహుల్ గాంధీ కూడా అదే డిమాండ్
- శనివారం ప్రధాన్ రాజీనామా
- ఆ తర్వాత ఆందోళన విరమించిన సీజేపీ
విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు ముందు ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నట్లు సమాచారం. కేంద్ర ప్రభుత్వం తొలుత ఆయన శాఖను మాత్రమే మార్చుతామని ప్రతిపాదించినట్లు సమాచారం. అయితే దానికి కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) తిరస్కరించినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ప్రధాన్‌ను మంత్రివర్గం నుంచే తప్పించాలని సీజేపీ స్పష్టం చేసినట్లు తెలిసింది.
సమాచారం ప్రకారం.. జులై 20న కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితేంద్ర సింగ్ సీజేపీ ప్రతినిధులు సౌరవ్ దాస్, ఆశుతోష్ రాంకాతో సమావేశమయ్యారు. ఆ సమయంలో ధర్మేంద్ర ప్రధాన్‌ను విద్యాశాఖ నుంచి మరో శాఖకు మార్చే ప్రతిపాదన చేసినట్లు తెలుస్తోంది. అయితే కేవలం శాఖ మార్పుతో తమ ఆందోళన విరమించబోమని, ఆయన పూర్తిగా మంత్రి పదవికి రాజీనామా చేయాల్సిందేనని సీజేపీ ప్రతినిధులు స్పష్టం చేసినట్లు సమాచారం. మంత్రి పదవుల కేటాయింపు, మార్పులు ప్రధానమంత్రి పరిధిలోని అంశమని కేంద్ర మంత్రులు చెప్పినట్లు తెలుస్తోంది.
ఒకవేళ రాజీనామా కాకుండా మరో ప్రతిపాదనకు అంగీకరిస్తే ఆందోళనకారుల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురవుతుందని సీజేపీ భావించినట్లు సమాచారం. ఇదే విషయాన్ని ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కూడా ప్రస్తావించారు. శాఖ మార్పు సరిపోదని, ధర్మేంద్ర ప్రధాన్ పూర్తిగా కేంద్ర మంత్రివర్గం నుంచి తప్పుకోవాల్సిందేనని ఆయన డిమాండ్ చేశారు.
శనివారం మధ్యాహ్నం ధర్మేంద్ర ప్రధాన్ విద్యాశాఖ మంత్రి పదవికి రాజీనామా చేశారు. అనంతరం సీజేపీ తమ ఆందోళన విరమిస్తున్నట్లు ప్రకటించింది. నీట్ ప్రశ్నపత్రాల లీక్ అంశాన్ని దేశ వ్యతిరేక శక్తులు ఉపయోగించుకోకుండా ఉండేందుకే తాను రాజీనామా చేస్తున్నట్లు ధర్మేంద్ర ప్రధాన్ తన రాజీనామా లేఖలో పేర్కొన్నారు.