హీరోయిన్ కోసం ఓ డైరెక్టర్ సొంత భార్యను కోమాలోకి వెళ్లేలా కొట్టాడు: పూనమ్ కౌర్

Poonam Kaur alleges director beat wife into coma for actress
షార్ట్స్‌లో చూడండి

టాలీవుడ్ నటి పూనమ్ కౌర్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పూనమ్ మాట్లాడుతూ, టాలీవుడ్‌లోని ఓ ప్రముఖ డైరెక్టర్ ఓ హీరోయిన్ కోసం తన భార్యను తీవ్రంగా చిత్రహింసలకు గురి చేశాడని ఆరోపించింది. అతడు తన భార్యను దారుణంగా కొట్టడంతో ఆమె కోమాలోకి వెళ్లిపోయిందని, ఆసుపత్రిలో వారం రోజుల పాటు చికిత్స పొందాల్సి వచ్చిందని చెప్పింది. 


ఇలాంటి దారుణం జరిగినా ఆ భార్య ఎవరికీ చెప్పకుండా మౌనంగా ఉండిపోయిందని, అన్యాయం జరిగినా బయటకు రాలేదని పూనమ్ విచారం వ్యక్తం చేసింది. అంతేకాకుండా, ఆ హీరోయిన్ సినిమా ఈవెంట్లకు కూడా హాజరవుతూ ఉండేదని, ఈ విషయం తెలిసినప్పుడు తాను చాలా షాక్ అయ్యానని, మనుషులు ఇలా కూడా ఉంటారా? అనిపించిందని చెప్పింది.


అయితే, పూనమ్ ఆ డైరెక్టర్ పేరును మాత్రం బహిరంగంగా చెప్పలేదు. హీరోయిన్ ఎవరన్నది కూడా రివీల్ చేయలేదు. దీంతో సోషల్ మీడియాలో ఈ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. నెటిజన్లు ఆ డైరెక్టర్ ఎవరు? ఆ హీరోయిన్ ఎవరు? అని పలు ఊహాగానాలు చేస్తున్నారు. 


సోషల్ మీడియాలో ఈ అంశం మరోసారి హాట్ టాపిక్ అయింది. కొందరు పూనమ్‌ను సపోర్ట్ చేస్తూ, ఇండస్ట్రీలోని ఇలాంటి దారుణాలు బయటపడాలని అంటున్నారు. మరికొందరు మాత్రం పేరు చెప్పకుండా ఇలా మాట్లాడటం వల్ల గందరగోళం పెరుగుతుందని వాదిస్తున్నారు. మొత్తంగా ఈ వ్యాఖ్యలు టాలీవుడ్‌లో కొత్త చర్చకు తెరలేపాయి.
Go Back to Shorts
Poonam Kaur
Tollywood
Telugu cinema
director
domestic violence
actress
controversy
coma
allegations
movie industry

More Telugu News