ప్రియాంక గాంధీ ఇంట్లో మోగనున్న పెళ్లి బాజాలు!
- సన్నిహితుల మధ్య రేహాన్ వాద్రా ఎంగేజ్ మెంట్
- రేహాన్ తన స్నేహితురాలిని పెళ్లాడనున్నట్లు జాతీయ మీడియాలో వార్తలు
- అధికారికంగా ప్రకటించని ప్రియాంక, రాబర్ట్ వాద్రా
ఏడేళ్లుగా వీరు స్నేహితులని, ఇటీవల రేహాన్ పెళ్లి ప్రతిపాదన తీసుకురాగా అవీవా అంగీకరించిందని తెలుస్తోంది. అవీవా బేగ్ కుటుంబంతో వాద్రా కుటుంబానికి స్నేహసంబంధాలు ఉన్నాయని సమాచారం. ఈ నేపథ్యంలోనే రేహాన్, అవీవాల ప్రేమకు ఇరు కుటుంబాలు ఆమోదం తెలిపాయని, నిశ్చితార్థం జరిపించాయని మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి. అయితే, రేహాన్ ఎంగేజ్ మెంట్ పై వాద్రా కుటుంబం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.