కోహ్లీ రిటైర్మెంట్ పై సిద్ధూ సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నాడంటే..!
- దేవుడు వరమిస్తే కోహ్లీ రిటైర్మెంట్ వాపస్ తీస్కోవాలనే కోరుకుంటానన్న సిద్ధూ
- టెస్ట్ క్రికెట్ లో కోహ్లీ ఆడాలని ఆకాంక్షించిన మాజీ క్రికెటర్
- ఇన్ స్టాలో వైరల్ గా మారిన సిద్ధూ పోస్ట్
కోహ్లీ మళ్లీ టెస్ట్ మ్యాచ్ లలో ఆడాలని, దేవుడు వరమిస్తే తాను ఇదే కోరుకుంటానని వ్యాఖ్యానించాడు. ఈ మేరకు సిద్ధూ తన ఇన్‌స్టా ఖాతాలో ఓ పోస్టు పెట్టాడు. ‘దేవుడు నాకు వరం ప్రసాదించి ఏదైనా కోరుకోమంటే కోహ్లీ తన రిటైర్మెంట్‌ను వెనక్కి తీసుకునేలా చేయమనే అడుగుతా. విరాట్ కోహ్లీ 24 క్యారెట్ల బంగారం. వయసు పెరిగినా కూడా అతడు 20 ఏళ్ల యువకుడిలా ఫిట్ గా ఉన్నాడు’ అంటూ అందులో పేర్కొన్నాడు. దీంతో ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నెటిజన్లు ఈ పోస్టుకు లైక్ లు కొడుతూ కోహ్లీ మళ్లీ టెస్టు క్రికెట్ ఆడాలని కామెంట్లు పెడుతున్నారు.