మావోయిస్టు కీలక నేత హిడ్మా మృతి... నిర్ధారించిన పోలీసులు
- మారేడుమిల్లి ఎన్ కౌంటర్ లో హిడ్మా, ఆయన భార్య రాజే సహా మొత్తం ఆరుగురు మావోయిస్టులు మృతి
- ఈ రోజు ఉదయం మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో ఎదురుకాల్పులు
- మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు హిడ్మా తలపై రూ.6 కోట్ల రివార్డు
గెరిల్లా దాడుల వ్యూహకర్త..
చిన్న వయసులోనే మావోయిస్టు కేంద్ర కమిటీకి ఎంపికైన హిడ్మా.. గెరిల్లా దాడుల వ్యూహకర్తగా పేరొందారు. ఆయన స్వస్థలం ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లా పూర్వాటి గ్రామం. పీపుల్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ కమాండర్‌గా, దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడిగానూ హిడ్మా పనిచేశారు.
మృతులు..
మద్వి హిడ్మా, ఆయన భార్య రాజే, అనుచరులు మల్లా, దేవే, చెల్లూరి నారాయణ అలియాస్ సురేశ్, టెక్ శంకర్.