రామోజీ ఎక్సలెన్స్ అవార్డుల కార్యక్రమం... పక్కపక్కనే కూర్చుని నవ్వులు చిందించిన చంద్రబాబు, రేవంత్... వీడియో వైరల్
- ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావు జయంతి
- హైదరాబాద్‌లో రామోజీ ఎక్సలెన్స్ అవార్డుల ప్రదానం
- ఏడు రంగాల్లో విశిష్ట సేవలు అందించిన వారికి పురస్కారాలు
- హాజరైన ఉపరాష్ట్రపతి, కేంద్రమంత్రులు, తెలుగు రాష్ట్రాల సీఎంలు
జర్నలిజం, గ్రామీణాభివృద్ధి, మానవ సేవ, సైన్స్ అండ్ టెక్నాలజీ, కళ-సంస్కృతి, యూత్ ఐకాన్, మహిళా సాధికారత వంటి ఏడు రంగాల్లో విశేష ప్రతిభ కనబర్చిన వారికి ఈ వేదికపై అవార్డులను ప్రదానం చేయనున్నారు. రామోజీరావు స్ఫూర్తిని కొనసాగిస్తూ వివిధ రంగాల్లో అద్భుతమైన కృషి చేసిన వారిని ఈ పురస్కారాలతో సత్కరించనున్నారు.
ఈ కార్యక్రమంలో ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పక్కపక్కనే ఆసీనులై నవ్వుతూ మాట్లాడుకోవడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇద్దరు నేతలు నవ్వులు చిందిస్తూ ముచ్చటించుకుంటున్న దృశ్యాలు అందరి దృష్టిని ఆకర్షించాయి.