వైసీపీ విషవృక్షం.. ఫేక్ పార్టీ: చంద్రబాబు
- నేరాలను నమ్ముకున్న పార్టీ వైసీపీ అని చంద్రబాబు విమర్శ
- రాష్ట్రంలో యూరియాకు కొరత లేదని వెల్లడి
- రైతుల ముసుగులో రాజకీయాలు చేస్తే ఖబడ్దార్ అని హెచ్చరిక
ఈ ఏడాది పంట పొలాల్లో రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. వినియోగాన్ని 33 లక్షల మెట్రిక్ టన్నులకు పరిమితం చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని వివరించారు. రాష్ట్రంలో యూరియాకు ఎలాంటి కొరత లేదని స్పష్టం చేశారు. ప్రస్తుతం జిల్లాల వారీగా 94,892 మెట్రిక్ టన్నుల యూరియా అందుబాటులో ఉండగా, మార్క్‌ఫెడ్ వద్ద మరో 81,750 మెట్రిక్ టన్నుల నిల్వలు ఉన్నాయని వెల్లడించారు. ఈ ఏడాది రెండు పంటలు సాగు చేయడం వల్ల నెల్లూరు జిల్లా రైతులు యూరియాను అత్యధికంగా వినియోగించారని ఆయన పేర్కొన్నారు.
రైతుల ముసుగులో వైసీపీ శ్రేణులు రాజకీయాలు చేస్తే ఖబడ్దార్ అని హెచ్చరించారు. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు చేస్తే చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు. వైసీపీ ఫేక్ పార్టీ అని... ఫేక్ రాజకీయాలు చేస్తుందని మండిపడ్డారు.