నేరస్థులు రాజకీయ ముసుగు వేసుకున్నారు.. వైసీపీపై మంత్రి నిమ్మల ఫైర్
- సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపాటు
- కూటమి పాలనలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక తప్పుడు ప్రచారం
- ప్రతిపక్ష హోదా రానీ ఏకైక పార్టీ వైసీపీ మాత్రమేనని ఎద్దేవా
రాష్ట్రంలో అభివృద్ధి పనులు కొనసాగితే తమ ఉనికి ప్రశ్నార్థకంగా మారుతుందనే భయాందోళనలతో వైసీపీ నేతలు ఇలా తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. నేరస్థులు రాజకీయ ముసుగు ధరించి పార్టీని నడుపుతున్నారని మంత్రి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్ష హోదా కూడా రాని ఏకైక పార్టీ వైసీపీ మాత్రమేనని ఎద్దేవా చేశారు. భారతీయులంతా పండుగలా జరుపుకునే ఆగస్టు 15 వేడుక రోజు జాతీయ జెండాను కూడా ఎగరవేయకుండా మాజీ ముఖ్యమంత్రి జగన్ వింత పోకడలకు తెరలేపారని మంత్రి నిమ్మల రామానాయుడు విమర్శించారు.