పులివెందుల చరిత్రలో వైసీపీ ఎప్పుడూ ఓడిపోలేదు: సజ్జల రామకృష్ణారెడ్డి
- జడ్పీటీసీ ఉప ఎన్నికపై న్యాయపోరాటం కొనసాగుతుందన్న సజ్జల
- ఈసీ గుడ్డిగా వ్యవహరించిందని విమర్శ
- పోలింగ్ బూత్ లలో వైసీపీ ఏజెంట్లు లేకుండానే పోలింగ్ నిర్వహించారని మండిపాటు
తాము కూడా ఢీ అంటే ఢీ అని తలపడి ఉంటే ఎన్నికల ఫలితం మరో విధంగా ఉండేదని... కానీ, ప్రజల ప్రాణాలకు ప్రమాదం రాకూడదని తాము భావించామని చెప్పారు. పోలింగ్ బూత్ లలో వైసీపీ ఏజెంట్లు లేకుండానే పోలింగ్ నిర్వహించారని మండిపడ్డారు. 15 పోలింగ్ బూత్ లకు 2 వేల మంది పోలీసులను పెట్టారని విమర్శించారు. ఇంటింటికీ వెళ్లి చూస్తే ఎంతమంది ఓటు వేశారో, ఎంత మంది వేలికి సిరా చుక్క ఉందో తెలుస్తుందని చెప్పారు. మన ప్రజాస్వామ్యాన్ని మనం రక్షించుకుందామని పిలుపునిచ్చారు.