తెలంగాణలో మరో 48 గంటలు విస్తారంగా వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరిక
- ఉత్తర తెలంగాణలో భారీ వర్షాల అవకాశం
- హైదరాబాద్‌లో పలుచోట్ల కుండపోత వర్షం
- ప్రధాన రహదారులు జలమయమై ట్రాఫిక్‌కు అంతరాయం
- డ్రైనేజీలు పొంగిపొర్లడంతో ప్రజలకు ఇబ్బందులు
- జీహెచ్‌ఎంసీ, డీఆర్‌ఎఫ్ బృందాలు అప్రమత్తం
- కొనసాగుతున్న వర్షపు నీటి తొలగింపు పనులు
తెలంగాణలో మరో రెండు రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. నైరుతి రుతుపవన ద్రోణి ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా వాతావరణం పూర్తిగా మారిపోయిందని తెలిపింది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది. గురువారం కూడా రోజంతా ఆకాశం మేఘావృతంగా ఉండి పలుచోట్ల వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు.
వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో హైదరాబాద్‌లో బుధవారం పలుచోట్ల భారీ వర్షం కురిసింది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, యూసుఫ్‌గూడ, సనత్‌నగర్, కృష్ణానగర్, ఫిలింనగర్, బోరబండ, ఎర్రగడ్డ, అమీర్‌పేట, పంజాగుట్ట, ఎస్‌ఆర్‌నగర్‌తో పాటు సికింద్రాబాద్, బోయిన్‌పల్లి, తిరుమలగిరి, అల్వాల్ ప్రాంతాల్లో వర్షం దంచికొట్టింది.
కుండపోతతో పలు రహదారులు జలమయమయ్యాయి. డ్రైనేజీలు పొంగిపొర్లడంతో వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని జీహెచ్‌ఎంసీ, డీఆర్‌ఎఫ్ బృందాలు అప్రమత్తమై సహాయక చర్యలు చేపట్టాయి. వర్షపు నీరు నిల్వ ఉన్న ప్రాంతాల్లో తొలగింపు పనులు కొనసాగుతున్నాయి.