సుడాన్ లో కుప్పకూలిన బంగారు గని... 11 మంది మృత్యువాత
- తూర్పు నైలు నది ప్రావిన్స్ లోని హోయిడ్ పట్టణంలో కెర్ష్ అల్ ఫీల్ గనిలో ఘటన
- మరో ఎనిమిది మందికి గాయాలు
- మృతి చెందిన 11 మంది మైనర్ కార్మికులే
- గనిలో తవ్వకాలు నిలివేసినట్లు ప్రకటించిన సుడానీస్ మినరల్ రిసోర్సెస్ లిమిటెడ్ కంపెనీ
తాజాగా తూర్పు సూడాన్‌లోని ఒక బంగారు గనిలో విషాదకరమైన సంఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో 11 మంది కార్మికులు మరణించగా, మరో ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు.
తూర్పు నైలు నది ప్రావిన్స్‌లోని హోయిడ్ పట్టణంలో గల కెర్ష్ అల్ ఫీల్ గనిలో ఈ దుర్ఘటన సంభవించింది. బంగారు గని కూలిపోయినట్లు సుడానీస్ మినరల్ రిసోర్సెస్ లిమిటెడ్ కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించినట్లు పేర్కొంది. ఈ ఘటనతో గనిలో తవ్వకాలను నిలిపివేసినట్లు కంపెనీ వెల్లడించింది. మృతులంతా మైనర్లు కావడం గమనార్హం.