గణేశ్ నిమజ్జనాలు: డీజే వాహనాలను అడ్డుకోవద్దన్న మంత్రి నారా లోకేశ్
- వినాయక నిమజ్జనంలో డీజేలకు అనుమతులు ఇవ్వాలని మంత్రి లోకేశ్ విజ్ఞప్తి
- అనుమతులు ఇవ్వకుండా పోలీసులు ఇబ్బంది పెడుతున్నారని సందేశాలు వస్తున్నాయన్న లోకేశ్
- ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని హోంమంత్రి, డీజీపీని కోరిన మంత్రి
- నిమజ్జనం సందర్భంగా ఒక్క డీజే వాహనాన్ని కూడా సీజ్ చేయొద్దని పోలీసులకు సూచన
ఆంధ్రప్రదేశ్‌లో వినాయక నిమజ్జన కార్యక్రమాలకు సంబంధించి డీజే వాహనాల అనుమతులపై రాష్ట్ర మంత్రి నారా లోకేశ్ స్పందించారు. ఉత్సవాల సందర్భంగా డీజే వాహనాలకు ఎలాంటి ఆటంకాలు లేకుండా అనుమతులు మంజూరు చేయాలని ఆయన హోంమంత్రి అనిత, డీజీపీని కోరారు. ఈ మేరకు గురువారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.
వినాయక నిమజ్జనం కోసం ఏర్పాటు చేస్తున్న డీజే వాహనాలకు పోలీసులు అనుమతులు ఇవ్వడం లేదని పలువురు తన దృష్టికి తీసుకొచ్చారని లోకేశ్ తెలిపారు. ప్రజల నుంచి ఈ విషయంపై తనకు అనేక సందేశాలు వస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. భక్తిశ్రద్ధలతో, ఉత్సాహంగా జరుపుకునే ఈ ఉత్సవాల్లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు.
ఈ నేపథ్యంలో రాష్ట్ర హోంమంత్రి అనిత, డీజీపీ వెంటనే జోక్యం చేసుకోవాలని లోకేశ్ విజ్ఞప్తి చేశారు. డీజే వాహనాలకు అనుమతులు ఇచ్చే ప్రక్రియను సులభతరం చేయాలని, ఎలాంటి జాప్యం లేకుండా వేగంగా క్లియరెన్సులు ఇవ్వాలని కోరారు. నిమజ్జనం సందర్భంగా రాష్ట్రంలో ఒక్క డీజే వాహనాన్ని కూడా పోలీసులు సీజ్ చేయకూడదని ఆయన స్పష్టంగా సూచించారు. ప్రజలు ప్రశాంతంగా, ఆనందంగా పండుగను జరుపుకునే వాతావరణం కల్పించాలని ఆయన పోలీసు శాఖకు విజ్ఞప్తి చేశారు.