సరిహద్దుల్లో తెలంగాణ జవాన్ ఆత్మహత్య.. రహస్యంగా ఉంచిన అధికారులు
- సర్వీస్ రివాల్వర్ తో కాల్చుకుని చనిపోయిన జవాన్
- మూడు రోజుల తర్వాత స్వగ్రామం చేరిన మృతదేహం
- సూసైడ్ కు కారణాలు తెలియరాలేదంటున్న కుటుంబ సభ్యులు
దేశ సేవకు వెళ్లిన నాగరాజు విగతజీవిగా తిరిగి రావడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆయన కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు శోకసంద్రంలో మునిగిపోయారు. కాగా, కుమారుడు మూడు రోజుల క్రితమే ఆత్మహత్య చేసుకున్నప్పటికీ అధికారులు తమకు సమాచారం ఇవ్వలేదని నాగరాజు కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నాగరాజు ఆత్మహత్యకు గల కారణంపై స్పష్టత లేదు. నాగరాజు ఆత్మహత్యపై విచారణ జరుపుతున్నామని అధికారులు తెలిపారు.