ఓటీటీకి మనసును కొల్లగొట్టే మాలీవుడ్ మూవీ!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఓటీటీకి మనసును కొల్లగొట్టే మాలీవుడ్ మూవీ!

Marana Mass Movie Upadate
  • బాసిల్ జోసెఫ్ హీరోగా డార్క్ హ్యూమర్ మూవీ 
  • ఏప్రిల్ లో థియేటర్లకు వచ్చిన సినిమా
  • 18 కోట్లకి పైగా వసూళ్లను రాబట్టిన కంటెంట్  
  • ఈ నెల 15వ తేదీ నుంచి స్ట్రీమింగ్

మాలీవుడ్ లో ఈ మధ్య కాలంలో కామెడీ వైపు నుంచి ఎక్కువగా వినిపిస్తున్న పేరు బాసిల్ జోసెఫ్. తన మార్క్ కామెడీతో ఆయన దూసుకుపోతున్నాడు. ఒక వైపున సినిమాలతో .. మరో వైపున వెబ్ సిరీస్ లతో తన దూకుడు కొనసాగిస్తున్నాడు. అలాంటి బాసిల్ జోసెఫ్ నుంచి ఇప్పుడు మరో మూవీ సోనీలివ్ పట్టాలపైకి రానుంది. ఆ సినిమా పేరే 'మరణ మాస్'.

మలయాళంలో హీరోగా ఒక రేంజ్ లో కొనసాగుతున్న టోవినో థామస్ ఈ సినిమాకి నిర్మాత. సొంత బ్యానర్లో ఆయన ఈ సినిమాను నిర్మించాడు. ఈ ఏడాది ఏప్రిల్ 10వ తేదీన థియేటర్లకు వచ్చింది. కేవలం 8 కోట్లతో నిర్మించిన ఈ సినిమా, 18 కోట్లకి పైగా వసూళ్లను రాబట్టింది. శివ ప్రసాద్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో, రాజేశ్ మాధవన్ .. షిజూ సన్నీ .. బాబు ఆంటోని .. సురేశ్ కృష్ణ ముఖ్యమైన పాత్రలను పోషించారు.    

డార్క్ హ్యూమర్ జోనర్లో రూపొందిన ఈ సినిమా, ఈ నెల 15వ తేదీ నుంచి సోనీలివ్ లో స్ట్రీమింగ్ కానుంది. మలయాళంతో పాటు తెలుగు .. తమిళ .. కన్నడ .. హిందీ భాషలలో అందుబాటులోకి రానుంది. థియేటర్స్ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ తెచ్చుకున్న ఈ సినిమాకి, ఓటీటీ వైపు నుంచి ఎన్ని మార్కులు పడతాయో చూడాలి.

Advertisement
Basil Joseph
Maranamass
Tovino Thomas
Malayalam Movie
SonyLIV
OTT Release
Dark Humor
Malayalam Cinema
Indian Cinema
Rajesh Madhavan

More Telugu News