ఒక్క బాంబు వేసి సరిపెట్టం.. హౌతీలకు నెతన్యాహు తీవ్ర హెచ్చరిక
- టెల్ అవీవ్ ఎయిర్ పోర్ట్ పై దాడికి తీవ్ర స్థాయిలో ప్రతీకార దాడులు చేస్తామన్న ఇజ్రాయెల్ ప్రధాని
- దేశంలోని ప్రధాన విమానాశ్రయంపై క్షిపణి దాడితో ప్రయాణికుల్లో ఆందోళన
- హౌతీ క్షిపణి దాడితో రన్ వే పై సుమారు 25 మీటర్ల భారీ గుంత
హౌతీల క్షిపణి దాడితో బెన్ గురియన్ విమానాశ్రయంలో తీవ్ర గందరగోళం నెలకొంది. క్షిపణి దాడి జరిగిన ప్రాంతంలో భారీగా పొగలు కమ్ముకున్న దృశ్యాలు కనిపించాయి. రన్ వే పై దాదాపు 25 మీటర్ల మేర భారీ గుంత ఏర్పడిందని అధికారులు తెలిపారు. టెర్మినల్ భవనంలోని ప్రయాణికులు భయాందోళనలకు గురయ్యారు. అయితే, దాడి జరిగిన అరగంట వ్యవధిలోనే ఎయిర్ పోర్ట్ లో తిరిగి విమానాల రాకపోకలను పునరుద్ధరించారు. అయితే, భద్రతా కారణాల దృష్ట్యా ఎయిర్ ఇండియా, డెల్టా ఎయిర్ లైన్స్, లుఫ్తాన్సా సహా పలు విదేశీ విమానయాన సంస్థలు టెల్ అవీవ్‌కు తమ సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేశాయి.