రామానాయుడు స్టూడియో భూముల వ్యవహారం.. సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే..!
ఈ క్రమంలో తాజాగా విచారణ జరిపిన జస్టిస్ అభయ్ ఎస్ ఓకా ధర్మాసనం... పిటిషన్‌లో జోక్యం చేసుకునేందుకు నిరాకరించింది. ఈ సందర్భంగా మధ్యంతర ఉపశమనం కుదరదని తేల్చి చెప్పింది. అవసరం అనుకుంటే ప్రభుత్వ షోకాజ్ నోటీసుపై సంబంధిత కోర్టును ఆశ్రయించాలని సూచించింది. మరోవైపు పిటిషన్‌ను ఉపసంహరించుకుంటామని సురేశ్ ప్రొడక్షన్స్ కోరగా... ధర్మాసనం అంగీకరించింది.