తెలంగాణ మంత్రివర్గ విస్తరణ అంశంపై టీపీసీసీ చీఫ్ కీలక వ్యాఖ్యలు
- మంత్రివర్గ విస్తరణపై చర్చలు సాగుతున్నాయని వెల్లడి
- ఇది ముఖ్యమంత్రి, అధిష్ఠానం పరిధిలోని అంశమన్న టీపీసీసీ చీఫ్
- ఆరు స్థానాలు ఖాళీ ఉండగా పదవులు ఆశిస్తున్న వారు ఎక్కువగా ఉన్నారని వ్యాఖ్య
ఈ నేపథ్యంలో, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ తాజాగా కేబినెట్ విస్తరణ అంశంపై కీలక వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో మీడియాతో మాట్లాడుతూ, మంత్రివర్గ విస్తరణపై చర్చలు కొనసాగుతున్నాయని తెలిపారు.
ఇది పూర్తిగా ముఖ్యమంత్రి, ఏఐసీసీ అధిష్ఠానం పరిధిలోని అంశమని స్పష్టం చేశారు. ప్రస్తుతం కేబినెట్‌లో ఆరు స్థానాలు ఖాళీగా ఉన్నాయని, అయితే ఆ పదవులను ఆశిస్తున్న వారి సంఖ్య ఎక్కువగా ఉండటమే ఈ జాప్యానికి ప్రధాన కారణమని అన్నారు. విస్తరణ సమయంలో అనేక సమీకరణాలను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుందని, కులగణన ఫలితాలకు అనుగుణంగా విస్తరణ జరగాలని అభిప్రాయపడ్డారు.