Advertisement

జంతర్ మంతర్ నిరసనకారులకు రూ.67 వేల పిజ్జాలు.. వైరల్ బిల్లు ఫేక్ అని అంగీకరించిన యువకుడు

Zhulou admits 73000 rupees pizza bill for Jantar Mantar protesters is fake
  • జంతర్ మంతర్ నిరసనకారులకు పిజ్జాలు పంపినట్లు వైరల్
  • రూ.73 వేలకు పైగా ఫుడ్ ఆర్డర్ చేసినట్లు బిల్లులు పోస్ట్ చేసిన నాగాలాండ్ యువకుడు
  • ఆ బిల్లు నకిలీదని, ప్రజలను తప్పుదోవ పట్టించానని స్వయంగా అంగీకారం
  • విరాళంగా వచ్చిన డబ్బును నిరసనకారులకే పారదర్శకంగా వాడతానని హామీ
పరీక్షల్లో జరిగిన అక్రమాలకు వ్యతిరేకంగా ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద విద్యార్థులు చేపట్టిన నిరసనలకు మద్దతుగా, నాగాలాండ్‌కు చెందిన ఒక యువకుడు రూ. 73,000 విలువైన ఆహారం పంపినట్లు సోషల్ మీడియాలో వైరలైన వార్త నకిలీదని తేలింది. ఆ బిల్లులు సృష్టించినవని, తాను ప్రజలను తప్పుదోవ పట్టించానని సదరు పోస్ట్ చేసిన వ్యక్తి స్వయంగా అంగీకరిస్తూ క్షమాపణలు కోరాడు.

వివరాల్లోకి వెళితే, 'adiespoems' అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతా కలిగిన ఝాలౌ అనే వ్యక్తి, జంతర్ మంతర్‌ వద్ద ఆందోళన చేస్తున్న నిరసనకారుల కోసం జూలై 22న రూ. 67,734 విలువైన 150 డొమినోస్ పిజ్జాలను, జూలై 24న రూ. 5,000 విలువైన బిస్కెట్లను ఆర్డర్ చేసినట్లు కొన్ని బిల్లుల స్క్రీన్‌షాట్లను పంచుకున్నాడు. తాను నాగాలాండ్‌లో ఉండటం వల్ల నిరసనలో నేరుగా పాల్గొనలేకపోయానని, అందుకే ఇలా మద్దతు తెలుపుతున్నానని ఆ పోస్టులో పేర్కొన్నాడు. దీంతో ఈ వార్త సామాజిక మాధ్యమాల్లో దావానలంలా వ్యాపించగా, సదరు యువకుడి ఉదారతపై నెటిజన్లు ప్రశంసలు కురిపించారు.

అయితే ఈ విషయం జాతీయ స్థాయిలో చర్చనీయాంశమైన తరుణంలో, ఆ యువకుడు మరో పోస్ట్ ద్వారా అసలు వాస్తవాన్ని వెల్లడించాడు. తాను షేర్ చేసిన బిల్లులు నకిలీవని అంగీకరించాడు. తప్పుడు సమాచారంతో ప్రజలను తప్పుదోవ పట్టించినందుకు క్షమించాలని కోరాడు. తన పోస్ట్‌ను చూసి కొందరు విరాళాలు పంపారని, ఆ మొత్తాన్ని పారదర్శకంగా నిరసనకారుల అవసరాల కోసమే ఖర్చు చేస్తానని హామీ ఇచ్చాడు.
Advertisement
Zhulou
Jantar Mantar protest
Fake pizza bill
Nagaland youth apology
Delhi student protest

More Telugu News