Somes Yadav: ఆరేళ్ల బాలికపై సొంత మామే అఘాయిత్యం.. ఆపై దారుణంగా హత్య

Six Year Old Girl Raped and Murdered by Uncle in Chhattisgarh

  • చత్తీస్‌గఢ్‌లోని దుర్గ్‌లో దారుణం
  • బాలికను హత్య చేసి పొరుగింటి వారి కారులో పడేసిన నిందితుడు
  • నేరాన్ని అంగీకరించిన సోమేశ్ యాదవ్
  • నిందితుడిపై కఠిన చర్యలు తీసుకుంటామన్న సీఎం విష్ణుదేవ్ సాయి

ఆరేళ్ల బాలికపై లైంగికదాడికి పాల్పడిన 24 ఏళ్ల మామ, ఆపై అత్యంత పాశవికంగా ఆమెను హత్య చేసి మృతదేహాన్ని కారులో పడేశాడు. చత్తీస్‌గఢ్‌లోని దుర్గ్‌లో జరిగిందీ దారుణ ఘటన. నవరాత్రి పండుగలు జరుపుకొంటున్న వేళ ఈ నెల 5న బాలిక అదృశ్యమైంది. ‘కన్యా భోజ్’ కార్యక్రమం కోసం బాలిక తన అమ్మమ్మ ఇంటి వచ్చింది. ఆ తర్వాత ఆమె తిరిగి వెళ్లలేదు. దీంతో పాప కోసం కుటుంబ సభ్యులు తీవ్రంగా గాలించారు. అయినప్పటికీ ఫలితం లేకపోవడంతో పోలీసులను ఆశ్రయించారు. 

బాలిక అమ్మమ్మ, బంధువు ఆలయానికి వెళ్లగా, నిందితుడు సోమేశ్ యాదవ్, బాలిక మాత్రమే ఇంట్లో ఉన్నారు. దీనిని తనకు అవకాశంగా మార్చుకున్న సోమేశ్ బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఆపై చిన్నారిని హత్య చేసి పొరుగింటి వారి కారులో మృతదేహాన్ని పడేశాడు. కారు ఎప్పుడూ అక్కడే పార్క్ చేస్తుండటం, ఒక డోర్‌కు లాక్ లేకపోవడం నిందితుడికి తెలుసని పోలీసులు తెలిపారు. 

ఈ ఘటనకు సంబంధించి ముగ్గురు అనుమానితుల్లో ఒకరిని పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. మిగతా ఇద్దరు నిందితుల్లో ఒకరు కారు యజమాని అని పోలీసులు తెలిపారు. ప్రశ్నించిన తర్వాత అతడిని విడిచిపెట్టినట్టు పేర్కొన్నారు. కారులోంచి బాలిక మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. చిన్నారి శరీరంపై గాయాలున్నాయని, ఆమెపై లైంగికదాడి జరిగినట్టు వైద్యులు నిర్ధారించారు. బాలిక మామను అరెస్ట్ చేశామని, నేరాన్ని అంగీరించాడని పోలీసులు తెలిపారు. నిందితుడిపై లైంగికదాడి, హత్య, కిడ్నాప్ కేసులు నమోదు చేసినట్టు చెప్పారు. 

ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన బాధిత బాలిక బంధువులు, గ్రామస్థులు బాలిక మృతదేహంతో మోహన్ నగర పోలీస్ స్టేషన్‌ వద్దకు చేరుకుని నిందితుడిపై చర్యలు తీసుకోవడంలో అలసత్వం వహిస్తున్నారని ఆరోపిస్తూ ఆందోళనకు దిగారు. క్రమంగా ఈ ఆందోళన హింసాత్మకంగా మారింది. పోలీస్ స్టేషన్‌పైకి రాళ్లు విసిరారు. పోలీసు వాహనానికి నిప్పు పెట్టారు. దీంతో పోలీసులు లాఠీచార్జ్ చేసి ఆందోళనకారులను చెదరగొట్టారు. ముఖ్యమంత్రి విష్ణు దేవ్ సాయి ఈ ఘటనను ‘అమానుషం’గా అభివర్ణించారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

Somes Yadav
Chhattisgarh Crime
Durga Child Rape
Child Murder
Six-Year-Old Girl Murder
Rape and Murder
Indian Crime News
Chhattisgarh Police
Vishnu Dev Sai
Crime in India
  • Loading...

More Telugu News