ఇన్ స్టాలో సాయిపల్లవి క్రేజ్ మామూలుగా లేదుగా.. ధోని, విజయ్ కూడా ఆమె ముందు దిగదుడుపే!
ఇన్ స్టాలో సాయి పల్లవికి సంబంధించిన విషయాలను తెలుసుకోవడానికి 25 శాతం మంది ఆసక్తి చూపిస్తున్నారట. ఇప్పటి వరకు ఏ హీరోయిన్ కూడా ఈ ఘనత అందుకోలేదని, ఇది కేవలం సాయి పల్లవికే సొంతమని ఆమె అభిమానులు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఈ విషయంలో హీరో విజయ్ 20 శాతం జనాలను ప్రభావితం చేస్తుండగా, ధోని 17 శాతం మందిని ప్రభావితం చేస్తున్నట్లు చెబుతున్నారు. మిగిలిన సెలబ్రిటీలలో 5 శాతం వరకు సోషల్ మీడియాలో జనాలను ప్రభావితం చేస్తున్నారట.