హెచ్‌సీయూ వ్యవహారంపై స్పందించిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్
- హెచ్‌సీయూ వ్యవహారంలో ప్రభుత్వం తీరు సరైనది కాదన్న కేసీఆర్
- హెచ్‌సీయూ ఉదంతాన్ని ప్రభుత్వం గుణపాఠంగా తీసుకోవాలన్న మాజీ సీఎం
- హెచ్‌సీయూ అంశం ద్వారా రాష్ట్ర ప్రతిష్ఠను దిగజార్చారని ఆగ్రహం
హెచ్‌సీయూ ఉదంతాన్ని ప్రభుత్వం గుణపాఠంగా తీసుకోవాలని ఆయన సూచించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణను దేశంలోనే ఆదర్శ రాష్ట్రంగా నిలబెట్టిందని అన్నారు. రాష్ట్రాన్ని అగ్రగామిగా తీర్చిదిద్దితే, దానిని నిలబెట్టుకోవడం ఈ ప్రభుత్వానికి చేతకాలేదని విమర్శించారు. ఇప్పటికే రాష్ట్ర ఆర్థిక ప్రతిష్ఠను ఈ ప్రభుత్వం దిగజార్చిందని అన్నారు. హెచ్‌సీయూ అంశం ద్వారా రాష్ట్ర ప్రతిష్ఠను మరింత దిగజార్చారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.