కవిత పార్టీకి భారీ షాక్... టీఆర్ఎస్ పేరు మార్చుకోవాల్సిందే అంటూ ఈసీ ఆదేశం

Kalvakuntla Kavitha party gets big shock as ECI orders TRS name change
  • తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) పేరుతో కవిత పార్టీ ఏర్పాటు
  • టీఆర్ఎస్ పేరుతో ఓటర్లలో గందరగోళం ఏర్పడే అవకాశం ఉందన్న ఈసీ
  • 15 రోజుల్లో మూడు ప్రత్యామ్నాయ పేర్లను సమర్పించాలని ఆదేశం
కల్వకుంట్ల కవిత ప్రతిపాదించిన కొత్త రాజకీయ పార్టీ ‘తెలంగాణ రక్షణ సేన’ (TRS) పేరుపై కేంద్ర ఎన్నికల సంఘం (ECI) కీలక నిర్ణయం తీసుకుంది. ఈ పేరును మార్చుకోవాల్సిందేనని స్పష్టం చేస్తూ ప్రధాన ఎన్నికల కమిషనర్ కవితకు అధికారిక లేఖ రాశారు. కవిత తన కొత్త పార్టీని ‘తెలంగాణ రక్షణ సేన’ (TRS) పేరిట రిజిస్ట్రేషన్ కోసం ఈసీకి దరఖాస్తు చేసుకుంది. అయితే, గతంలో కేసీఆర్ నేతృత్వంలోని తెలంగాణ రాష్ట్ర సమితి (TRS) సంక్షిప్త నామం కారణంగా ఈ పేరు ఓటర్లలో గందరగోళం సృష్టించే అవకాశం ఉందని ఈసీ అభిప్రాయపడింది. దీంతో పార్టీ పేరు మార్చాలని ఆదేశించింది.

రాబోయే 15 రోజుల్లోగా మూడు ప్రత్యామ్నాయ పేర్లను సమర్పించాలని కవితకు ప్రధాన ఎన్నికల కమిషనర్ సూచించారు. లేకపోతే పార్టీ రిజిస్ట్రేషన్ దరఖాస్తును ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా మూసివేస్తామని హెచ్చరించారు.

ఈ పేరుపై బీఆర్ఎస్‌తో పాటు వివిధ వర్గాల నుంచి ఈసీకి భారీగా అభ్యంతరాలు, ఫిర్యాదులు వచ్చాయి. మహారాష్ట్రలోని మరో సంస్థ కూడా ఇదే పేరుకు దరఖాస్తు చేసుకోవడం వివాదాన్ని మరింత సంక్లిష్టం చేసింది. గతంలో కేసీఆర్ పార్టీ ‘తెలంగాణ రాష్ట్ర సమితి’ (TRS)గా ప్రారంభమై ఆ తర్వాత ‘భారత్ రాష్ట్ర సమితి’ (BRS)గా మారింది. ఇప్పుడు కవిత మళ్లీ అదే TRS సంక్షిప్త నామంతో కొత్త పార్టీని ఏర్పాటు చేయడంపై పలువరు  అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈసీ లేఖపై కవిత ఎలా స్పందిస్తారో వేచిచూడాలి.
Kalvakuntla Kavitha
Telangana Rakshana Sena
Election Commission of India
TRS Party Name
Telangana Politics
BRS Party

More Telugu News