ఇట్స్ అఫీషియల్... విజయ్ సేతుపతితో పూరి జగన్నాథ్ పాన్ ఇండియా సినిమా
- విజయ్ సేతుపతి, పూరి జగన్నాథ్ కాంబినేషన్లో సినిమా
- కొత్త సినిమాను ప్రకటించిన పూరి కనెక్ట్స్
- జూన్ నుంచి రెగ్యులర్ షూటింగ్
తమిళ స్టార్ విజయ్ సేతుపతితో పూరి జగన్నాథ్ సినిమా చేయబోతున్నారనే వార్తలు కొన్ని రోజులుగా వస్తున్నాయి. ఆ వార్తలు నిజమయ్యాయి. దీనికి సంబంధించిన అఫీషియల్ అప్డేడ్ ఇప్పుడు వచ్చింది. విజయ్ సేతుపతితో సినిమాను తెరకెక్కిస్తున్నట్టు ప్రొడక్షన్ హౌస్ 'పూరి కనెక్ట్స్' ప్రకటించింది. పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమాను నిర్మిస్తున్నట్టు తెలిపింది. రెగ్యులర్ షూటింగ్ జూన్ లో ప్రారంభమవుతుందని వెల్లడించింది. త్వరలోనే మరిన్ని అప్డేట్స్ ఇస్తామని తెలిపింది. ఈ సినిమాకు సినీ నటి చార్మి సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.