సొంతపార్టీ నేతలపై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసిన రాజాసింగ్
- పార్టీలో తనపై కుట్ర జరుగుతోందని ఆరోపణ
- జైలుకు పంపించే ప్రయత్నం చేశారని వెల్లడి
- తనపై పీడీయాక్ట్ పెట్టాలని పోలీసులకు బీజేపీ నేతలే చెప్పారన్న ఎమ్మెల్యే
పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి ఎంపికపైనా రాజాసింగ్ ఇటీవల కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలతో రహస్యంగా సమావేశమయ్యే వారిని కాకుండా, పార్టీ కోసం కష్టించి పనిచేసే నికార్సైన లీడర్ ను రాష్ట్ర అధ్యక్షుడిగా చేయాలని డిమాండ్ చేశారు. పార్టీ కోసం, కార్యకర్తల కోసం నిరంతరం పనిచేసే లీడర్ ను అధ్యక్షుడిగా చేస్తే రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడటం ఖాయమని ఆయన అన్నారు.