కునాల్ కామ్రా వ్యాఖ్యలపై ఏక్ నాథ్ షిండే ఏమన్నారంటే..?
- దేనికైనా సరే ఓ హద్దంటూ ఉండాలన్న మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి
- తనపై వ్యాఖ్యలు చేయడానికి కామ్రా సుపారీ తీసుకున్నట్లుందని వ్యాఖ్య
- హద్దుమీరితే.. రియాక్షన్ తప్పకుండా ఉంటుందని వార్నింగ్
విమర్శలైనా, సెటైర్లకైనా ఓ పద్దతంటూ ఉండాలని, ఇష్టానుసారం మాట్లాడటం పద్దతికాదన్నారు. తనపై సెటైర్లు వేయడానికి కామ్రా సుపారీ తీసుకున్నట్లు ఉందని షిండే ఆరోపించారు. కాగా, ముంబైలోని ఓ హోటల్ లో ఆదివారం నిర్వహించిన కార్యక్రమంలో కునాల్ కామ్రా చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. ఏక్ నాథ్ షిండేను ద్రోహి అనడంపై శివసేన (షిండే వర్గం) కార్యకర్తలు తీవ్రంగా మండిపడ్డారు. సదరు హోటల్ పై దాడిచేసి విధ్వంసం సృష్టించారు. ఫర్నిచర్, కిటికీలు, మైక్ లు, సీలింగ్ ను ధ్వంసం చేశారు.