కామారెడ్డి, వికారాబాద్ సహా పలు ప్రాంతాల్లో వడగండ్ల వాన
- మొక్కజొన్న సహా దెబ్బతిన్న వివిధ పంటలు
- భారీ వర్షం కురవడంతో విద్యుత్ నిలిపివేత
- పలు జిల్లాల్లో మోస్తరు వర్షం
వికారాబాద్ నియోజకవర్గం పరిధిలోని మోమిన్‌పేట, నవాబుపేట మండలాల్లో కూడా వడగండ్ల వాన కురిసింది. ఈదురుగాలులు వీయడంతో నవాబుపేట మండలం చిట్టిగిద్ద గ్రామ సమీపంలో ఒక భారీ వృక్షం నేలకూలింది. దీని కారణంగా కొంతసేపు రాకపోకలు నిలిచిపోయాయి. సంగారెడ్డి జిల్లాలోని జహీరాబాద్‌లోనూ వడగండ్ల వర్షం కురిసింది. తెలంగాణలోని పలు జిల్లాల్లో మోస్తరు వర్షం కురిసింది.