భారీ లాభాలతో ముగిసిన సెన్సెక్స్, నిఫ్టీ
- 899 పాయింట్లు లాభపడిన సెన్సెక్స్
- 283 పాయింట్లు పెరిగిన నిఫ్టీ
- ప్రధాన రంగాల షేర్ల విలువలో ఒక శాతం వృద్ధి
ఇవాళ 2,296 షేర్లు లాభాలతో కళకళలాడగా... 1,554 షేర్లు నష్టపోయాయి. 124 షేర్ల విలువలో ఎలాంటి మార్పు లేదు. అన్ని ప్రధాన రంగాలకు చెందిన షేర్లు జోరుగా ట్రేడయ్యాయి. ఐటీ, ఎఫ్ఎంసీజీ, రియాల్టీ, టెలికాం షేర్లలో 1 శాతం పెరుగుదల నమోదైంది.
ఎయిర్ టెల్, టైటాన్, బజాజ్ ఆటో, బీపీసీఎల్, బ్రిటానియా, ఐషర్ మోటార్స్ షేర్లు లాభాల బాటలో పయనించగా... ఇండస్ ఇండ్ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్, శ్రీరామ్ ఫైనాన్స్, ట్రెంట్ నష్టపోయాయి.