ఢిల్లీలో అమిత్ షా, నిర్మలా సీతారామన్ లను కలిసిన సీఎం చంద్రబాబు
- ఢిల్లీ పర్యటనకు వెళ్లిన ముఖ్యమంత్రి చంద్రబాబు
- కేంద్రమంత్రులతో వరుస భేటీలు
- రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై వారితో చర్చ
- చంద్రబాబు వెంట రాష్ట్ర ఎంపీలు
రాష్ట్రానికి రావాల్సిన నిధులు, విభజనకు సంబంధించిన పెండింగ్ అంశాలు, అమరావతి, పోలవరం తదితర అంశాలపై కేంద్రమంత్రులతో మాట్లాడారు. ఈ పర్యటనలో చంద్రబాబు వెంట కేంద్రమంత్రులు కింజరాపు రామ్మోహన్ నాయుడు, డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్, ఎంపీలు సీఎం రమేశ్, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తదితరులు ఉన్నారు.






