మంత్రాలయం రాఘవేంద్రస్వామిని దర్శించుకున్న మంత్రి నారా లోకేశ్... ఫొటోలు ఇవిగో!

Nara Lokesh visits Mantralayam Raghavendra Swamy temple
  • కర్నూలు జిల్లాలో మంత్రి నారా లోకేశ్ పర్యటన
  • రాఘవేంద్రస్వామి గురువైభవోత్సవాలకు హాజరు
  • ఎంతో ఆనందంగా ఉందని వెల్లడి 
ఏపీ విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ నేడు కర్నూలు జిల్లాలోని సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం మంత్రాలయం విచ్చేశారు. ఇక్కడి రాఘవేంద్రస్వామి వారిని దర్శించుకున్నారు. అంతకుముందు, స్థానికంగా ఉన్న మాంచాలమ్మ అమ్మవారిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. 

రాఘవేంద్రస్వామి గురువైభవోత్సవాల్లో పాల్గొనడంపై లోకేశ్ స్పందించారు. మంత్రాలయంలో గురువైభవోత్సవాల్లో పాల్గొనడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు. రాయలసీమలో వలసలు లేకుండా చూడాలన్నదే కూటమి ప్రభుత్వ లక్ష్యమని వెల్లడించారు. 

కాగా, మంత్రాలయం పర్యటన సందర్భంగా స్వామివారి పట్టాభిషేక మహోత్ంసవం అనంతరం ఆలయంలో జరిగిన రథోత్సవంలోనూ నారా లోకేశ్ పాల్గొన్నారు. స్వయంగా రథాన్ని లాగారు. ఆలయ ప్రాంగణంలో కొత్తగా నిర్మించిన షాపింగ్ కాంప్లెక్స్ ను ప్రారంభించారు.
Go Back to Shorts
Nara Lokesh
Raghavendra Swamy temple
Mantralayam
Kurnool District

More Telugu News