సాధారణ ఎమ్మెల్యేగా జగన్ గేట్-4 నుంచి నడుచుకుంటూ వెళతారా?
- రేపటి నుంచి ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు
- ప్రతిపక్ష నేత హోదా లేని జగన్
- ప్రొటోకాల్ ప్రకారం గేట్ 4 నుంచి నడుచుకుంటూ వెళ్లాల్సిన పరిస్థితి
అయితే అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యేవాళ్లందరూ ప్రొటోకాల్ ప్రకారం వారికి కేటాయించిన గేట్ల నుంచి లోపలకు రావాల్సి ఉంటుంది. గేట్ నెంబర్ 1 నుంచి గవర్నర్, సీఎం, డిప్యూటీ సీఎం, స్పీకర్, డిప్యూటీ స్పీకర్ తదితరులు లోపలకు వస్తారు. గేట్ నెంబర్ 2 నుంచి మంత్రులు వస్తారు. గేట్ నెంబర్ 4 నుంచి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నడుచుకుంటూ లోపలకు రావాల్సి ఉంటుంది.
జగన్ సాధారణ ఎమ్మెల్యే కావడంతో ఆయన గేట్ నెంబర్ 4 నుంచి నడుచుకుంటూ రావాల్సి ఉంటుంది. ఇప్పుడు దీనిపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. మరోవైపు, స్పీకర్ తనకు ఉన్న అధికారాన్ని ఉపయోగించి... గేట్ నెంబర్ 1 నుంచి వచ్చేందుకు జగన్ కు అనుమతిని ఇస్తారా? అనే దానిపై కూడా చర్చ జరుగుతోంది.